»   » నాని తర్వాతి సినిమా ‘జై బాలయ్య’?

నాని తర్వాతి సినిమా ‘జై బాలయ్య’?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు యంగ్ హీరో నాని త్వరలో అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో నాని ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో నాని అనంతపురం నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ప్రెసిడెంటుగా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘జై బాలయ్య' అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Nani next film Jai Baalayya?

నాని ప్రస్తుతం ‘భలే భలే మగాడివోయ్' సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, జిఏ2 (ఎ డివిజన్ ఆఫ్ గీతా ఆర్ట్స్) బాన్య‌ర, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా రూపోందిస్తున్న ఫ్యామిలి అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్'. నానికి జోడీగా లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తోంది. ఆగ‌ష్టు రెండ‌వ వారంలో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

నాని, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌, సితార‌, స్వ‌ప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్‌, బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను, ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌, ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి, సంగీతం: గోపి సుంద‌ర్, నిర్మాత: బ‌న్నివాసు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మారుతి.

English summary
Hanu Raghavapudi of Andala Rakshasi fame is directing Nani for a new film. According to reports the actor will be seen as Anantapur Fans President of Nandamuri Balakrishna. If reports are to be believed makers are considering 'Jai Balayya' as the title of the movie.
Please Wait while comments are loading...