»   » హీరో నాని కూడా పాలిటిక్స్‌లోకి వస్తున్నాడా?

హీరో నాని కూడా పాలిటిక్స్‌లోకి వస్తున్నాడా?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Nani's Next Movie With Dil Raju

  హీరో నాని.... క్లాప్ బాయ్‍‌గా కెరీర్ మొదలుపెట్టి ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ కాలంలోనే తన టాలెంటుతో తెలుగులో స్టార్ హీరో రేంజికి వెళ్లిపోయాడు. తారక్ లాంటి పెద్ద హీరోలు హోస్ట్ చేసిన బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలకు నాని తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదంటే... ఈ నేచురల్ స్టార్‌కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల పరంగా రకరకాల జానర్లు చేస్తూ డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్న నాని... త్వరలో పాలిటిక్స్‌ జోన్లోకి రాబోతున్నాడట. కొంపదీసి నాని 2019 ఎన్నికలపై దృష్టి పెట్టాడని మాత్రం అనుకోవద్దు. పొలిటికల్ జానర్ మూవీ చేయబోతున్నాడంతే!

   ‘సభకు నమస్కారం' టైటిల్

  ‘సభకు నమస్కారం' టైటిల్

  నాని చేయబోతున్న పొలిటికల్ మూవీకి ‘సభకు నమస్కారం' అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

   ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా..

  ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా..

  ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే జానర్లో త్వరలో విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా' మూవీ కూడా రాబోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ మేనియా ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో పొలిటికల్ థ్రిల్లర్స్ జనాలకు బాగా ఎక్కుతాయని భావిస్తున్నారు.

   కొత్తవి ట్రై చేయడంలో ముందుండే నాని

  కొత్తవి ట్రై చేయడంలో ముందుండే నాని

  నాని ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయికి రావడాని కారణం.... అతడు ఎంచుకునే కథలే. చేసిన కథలే మళ్లీ మళ్లీ చేయకుండా డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకులకు తన సినిమాలంటే బోర్ కొట్టకుండా జాగ్రత్త పడుతున్నాడు.

  షూటింగులతో నాని బిజీ బిజీ

  షూటింగులతో నాని బిజీ బిజీ

  ప్రస్తుతం నాని వరు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన నాగార్జునతో కలిసి చేస్తున్న సభకు నమస్కారం సెట్స్ మీద ఉంది. దీంతో పాటు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ‘జెర్సీ' అనే స్పోర్డ్స్ బ్యాగ్రౌండ్ ఉన్న మూవీ కూడా అనౌన్స్ అయింది. ఇవన్నీ పూర్తయ్యాక ‘సభకు నమస్కారం' పెట్టే అవకాశం ఉంది.

  English summary
  Actor Nani recently signed a sports drama titled as Jersey under the production banner of Sitara Entertainments. As soon as he wraps up this project, he is expected to join the sets of a movie under Dil Raju's production. As per the latest reports, two interesting things about the movie came out. The movie is going to run with a political backdrop, tiltled Sabhaku Namaskaram.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more