»   » డ్యూయిల్ రోల్ లో నాని...డిటేల్స్

డ్యూయిల్ రోల్ లో నాని...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: "కృష్ణగాడి వీర ప్రేమ గాధ" అంటూ ఈ వారం హిట్ కొట్టి ఊపు మీదున్న హీరో నాని. ఈ సారి ఆయన డ్యూయిల్ రోల్ తో మనని అలరించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకోసం ఆయన ప్రాజెక్టుని రెడీ చేసుకున్నాడు. ఈ కొత్త చిత్రం టైటిల్ "ధమాకా".

తనను "అష్టాచెమ్మా" వంటి చిత్రంతో పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే రెండు నెలలు పాటు షూటింగ్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాలో మళయాళం నటి నివేద ధామస్, సురభి హీరోయిన్స్ గా చేస్తున్నట్లు సమాచారం.

Nani's dual role in his next 'Dhamaka'

ఈ "ధమాకా" చిత్రంలో డ్యూయిల్ రోల్స్ కు ఓ చిత్రమైన లింక్ ఉంటుందని, ఇప్పటివరకూ అలాంటి పాయింట్ తో సినిమా రాలేదని చెప్తున్నారు. అల్లరి నరేష్ తో చేసిన బందిపోటు చిత్రం ప్లాఫ్ అవటంతో బాగా వెనకబడ్డ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.

భలే భలే మొగాడివోయ్ అంటూ హిట్ కొట్టిన నాని, అదే తరహా ఫన్ ని ఈ సినిమాలోనూ పండించనున్నారు. స్క్రిప్టులో చాలా విషయాల్లో దగ్గరుండి తనదైన ఇన్ పుట్స్ ఇచ్చి మరీ ఈ స్క్రిప్టుని రెడీ చేయించుకున్నట్లు చెప్తున్నారు. అందుకే నాని ...దూసుకుపోతున్నాడు.

English summary
Nani is playing a dual role in his next film will be directed by Mohankrishna Indraganti . Tentative title of the movie is "Dhamaka".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu