For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా ఫ్యాన్స్ వల్ల నాని సినిమాకు కష్టాలు.. ఇలా అయితే నష్టాలేనంటున్న విశ్లేషకులు

  |

  నాని.. తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు వారి మనసు దోచిన యంగ్ హీరో. స్వయంకృషితో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ అని కూడా బిరుదును దక్కించుకున్నాడు. నటన, బావోద్వేగాలు పండించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఈ యంగ్ హీరో కెరీర్ మంచిగానే సాగిపోతోంది. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమా చేస్తున్నాడు.

  ప్రేక్షకుల నుంచి స్పందన

  ప్రేక్షకుల నుంచి స్పందన

  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ‘గ్యాంగ్ లీడర్'లో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. అలాగే ‘ఆర్ఎస్ 100' హీరో కార్తికేయ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వీరితో పాటు ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  టైటిల్‌పై మెగా ఫ్యాన్స్

  టైటిల్‌పై మెగా ఫ్యాన్స్

  ఈ సినిమాకు ‘గ్యాంగ్ లీడర్' అని టైటిల్ అనౌన్స్ చేయగానే మెగా ఫ్యాన్స్ అందరూ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో చిరంజీవి సినిమా టైటిల్ పెట్టుకోవడంతోనే వాళ్లు ఇలా తమ స్పందన తెలియజేశారు. అదీ కాకుండా ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో భారీ హిట్‌గా నిలవడమూ ఒక కారణంగా చెప్పవచ్చు.

  లుక్‌తో కూల్ చేశాడు

  లుక్‌తో కూల్ చేశాడు

  ఇటీవల జరిగిన చిరు పుట్టినరోజు సందర్భంగా గ్యాంగ్ లీడర్ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో గ్యాస్ కట్టర్‌ను చేతిలో పట్టుకుని బ్లాక్ గాగుల్స్‌తో అచ్చం 1991లో వచ్చిన చిరంజీవి గ్యాంగ్ లీడర్‌లోని లుక్‌ను రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. నాని దేని కోసం గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించాడో తెలియదు కానీ ఈ పోస్టర్‌తో మెగా ఫ్యాన్స్ కూల్ అయిపోయారు.

  భారీ స్థాయిలో విడుదల

  భారీ స్థాయిలో విడుదల

  ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘గ్యాంగ్ లీడర్'ను భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాను 200 పైగా లొకేషన్లలో విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ అని టాక్. దీనికి కారణం నానికి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉండడమేనని సమాచారం. వాస్తవానికి నాని కెరీర్‌లో ఇప్పటికి ఆరు సార్లు 1 మిలియన్ మార్కను అందుకున్నాడు. దీన్ని మరోసారి రిపీట్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

  నాని సినిమాకు కష్టాలు

  నాని సినిమాకు కష్టాలు

  ఈ సినిమాకు ‘గ్యాంగ్ లీడర్' అని టైటిల్ పెట్టడానికి తోడు చిరును పోలిన లుక్‌ను విడుదల చేయడంతో మెగా ఫ్యాన్స్‌ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో కొంచెం తేడా చేసినా ఈ సినిమాకు కష్టాలు తప్పవన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ఈ సినిమా ట్రైలర్ చూస్తే కామెడీ ఎక్కువగా ఉన్నట్లు అనిపించడంతో వారంతా నిరాశకు గురవుతున్నారట. గతంలో నాని సినిమా వస్తే ఆసక్తితో ఎదురు చూసే వారు. ఇప్పుడు మాత్రం ‘గ్యాంగ్ లీడర్' గురించి చర్చించడమే లేదు. ఇదే కొనసాగితే సినిమాకు నష్టాలేనని విశ్లేషకులు చెబుతున్నారు.

  English summary
  Tollywood Young Hero Natural Star Nani Upcoming Movie Is Gang Leader. Vikram Kumar Directes This Movie. And This Movie Prduced By Big Production House Mythri Movie Makers. This Movie Release Date Fix.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X