For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మొదటిసారి దైవశక్తితో నాని పోరాటం.. శ్యామ్ సింగరాయ్ లో అదే హైలెట్!

  |

  నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూసేలా ఉంటుంది. వీలైనంతవరకు లవ్ స్టోరీ కామెడీ సినిమాలతో ఎక్కువగా ఆకట్టుకునే నాని అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు లైక్ చేస్తారు. సినిమా కథ ఎలా ఉన్నా కూడా అందులో నాని పాత్ర స్వభావం చాలా విభిన్నంగా ఉంటుంది. నేచురల్ గా వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. అప్పటికే అతనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తోంది. మీడియం రేంజ్ హీరోలలో ఒక విధంగా నాని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పవచ్చు.

  ఇక నాని ప్రయోగాత్మకమైన కథలను ఇప్పటి వరకూ పెద్దగా టచ్ అయితే చేయలేదు. ఎక్కువగా తన కథలలో కమర్షియల్ పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని విభిన్నమైన ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పిరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రాబోతున్నట్లు సమాచారం. ఇది వరకే విడుదలైన కొన్ని పోస్టర్లతో సినిమా ఎలా ఉండబోతుందనే విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సాయి పల్లవి ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆమెకు ఈ సినిమాలో కొన్ని దైవ శక్తులు కూడా ఉంటాయని తెలుస్తోంది.

  Nani upcoming project shyam singha roy main story plot

  ఇక నాని పాత్ర దైవశక్తితో కూడా పోరాటం చేస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రయోగాలు చేసింది లేదు. మొదటిసారి తన బార్డర్ ను దాటి ప్రయోగం చేస్తున్నాడు. ఇది వరకే V సినిమాతో సైకో కిల్లర్ గా కనిపించి కాస్త రిస్క్ అయితే చేశాడు. ఆ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైంది కాబట్టి నిర్మాతకు పెద్దగా నష్టాలు రాలేదుమ్ అదే సినిమా థియేటర్స్ లో విడుదలయ్యి ఉంటే భారీ స్థాయిలో నష్టాలు కలిగి ఉండేవని కథనాలు వెలువడ్డాయి. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా మొదటి సారి నాని సీరియస్ గా కనిపిస్తూనే ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాడని తెలుస్తోంది. అతనికి జోడీగా సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే.

  ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర చాలా కీలకమైందని తెలుస్తోంది. రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకొని తన స్థాయిని పెంచుకోవాలి అని అనుకుంటున్నాడు. దైవ శక్తికీ దుష్ట శక్తి కి మధ్యలో ఉండే చిన్న పాయింట్ సినిమాలో హైలెట్ గా చూపిస్తారట. ఇక గ్రాఫిక్స్ కూడా సినిమాలో అద్భుతంగా ఉంటాయట. ఇక ఈ కథనాలు ఎంతవరకు నిజమో అనే విషయాన్ని పక్కన పెడితే సినిమా కోసం నిర్మాతలు కూడా గట్టిగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. నాని మార్కెట్ కంటే ఎక్కువగా ఈ సినిమాకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇక కథపై ఎంతో నమ్మకంగా ఉన్న నాని రెమ్యునరేషన్ కూడా ముందుగా తీసుకోలేదని తెలుస్తోంది. సినిమా హిట్ అయిన తర్వాతనే లాభాల్లో వాటా అందుకునే విధంగా డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Nani upcoming project shyam singha roy main story plot and full details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X