»   » నారా రోహిత్ నెక్ట్స్ శ్రీను వైట్ల దర్శకత్వంలో..?

నారా రోహిత్ నెక్ట్స్ శ్రీను వైట్ల దర్శకత్వంలో..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ తన తదుపరి చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కొన్ని సిట్టింగ్స్ జరిగాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నారా రోహిత్..పెద నాన్న నారా చంద్రబాబు నాయుడు ఈ చిత్రాన్ని తనకు తెలిసున్న నిర్మాత ద్వారా ప్రొడ్యూస్ చేయించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక శ్రీను వైట్ల కూడా ఈ ఆఫర్ ఒప్పుకుంటాడని, ఢీ లాంటి కథతో కలుస్తానని వారికి మాట ఇచ్చినట్లు అంటున్నారు. ఇక నారా రోహిత్..బాణం తర్వాత బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్ గా చిత్రం ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. అయితే అవి కార్య రూపం దాల్చలేదు. మరో ప్రక్క కొత్త గా ప్రవేశిస్తున్న యంగ్ హీరోలు నాగచైతన్య, రానా వంటివారు ఓ స్ట్రాటజీతో దూసుకుపోతూంటే నారా రోహిత్ ని గైడ్ చేసే వారు లేనట్లుగా ఖాళీగా ఉండిపోయారు. దాంతో చంద్రబాబే ఈ కాంబినేషన్ నిర్ణయానికి వచ్చి శ్రీను వైట్లతో మాట్లాడాడని వార్త. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్లో చిత్రం కోసం స్క్రిప్టు వండుతున్నారు. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu