twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో రామ్ ప్లేస్ లోకి నారా రోహిత్

    By Srikanya
    |

    Nara Rohit
    హైదరాబాద్: వరస ఫ్లాపులతో దూసుకువెళ్తున్న రామ్ నుంచి మరో ప్రాజెక్టు చేజారింది. పరుశురామ్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం అవుతుందని అంతా భావించారు. అయితే రామ్ ..కి కథ ఓకే అయ్యిందని మొదట చెప్పి..తర్వాత మసాలా ఫ్లాప్ తో భయపడి..అతి జాగ్రత్తలు తీసుకోవాలని కథలో రోజుకో మార్పు చెప్తూండటంతో ...విసుగుచెందిన పరుశురామ్ బయిటకు వచ్చేసాడని ఇండస్ట్రీ టాక్. దాంతో అదే కథని ఇప్పుడు పరుశరామ్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నారా రోహిత్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన రానుంది.

    వర్తమాన రాజకీయాల్ని ప్రశ్నించే ప్రజా 'ప్రతినిధి'గా నారా రోహిత్ ప్రేక్షకులముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి జె.సాంబశివరావు నిర్మాత. ఈ చిత్రం ఓ కిడ్నాప్ కథ చుట్టూ జరగనుంది. మొన్న ఆడియో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.

    నారా రోహిత్ మాట్లాడుతూ..ఈరోజుల్లో రూపాయికే విలువ లేదు. ఇక పైసల్ని పట్టించుకొనేదెవరు? కానీ అతను అలా కాదు. ప్రతి పైసాకీ సమాధానం చెప్పాల్సిందే. ఎనభై నాలుగు పైసల కోసం ఏకంగా.. ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేశాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన కాళ్ల దగ్గరకు రప్పించాడు. ఇంతకీ అతనెవరు? ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమస్యలపై ఓ సామాన్యుడు సాగించిన సమరం ఇది. ప్రతినిధిగా నారా రోహిత్‌ నటన, ఆయన పలికే సంభాషణలు అందరికీ నచ్చుతాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రచార చిత్రం కూడా ఆకట్టుకొంటోంద''న్నారు. ''ప్రస్తుత రాజకీయాలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ చిత్రంద్వారా చూపిస్తున్నాం''అని నిర్మాత చెప్పారు.

    ఇక '18 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే...వస్తున్నా...అడగడానికే వస్తున్నా..' అని నారా రోహిత్ ట్రైలర్స్ లో అంటున్నారు. సమకాలీన రాజకీయాంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ప్రజా శ్రేయస్సును కాంక్షించే సిసలైన ప్రజా ప్రతినిధి ఎలా వుండాలో సినిమాలో చూపిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి . సంగీతం: సాయికార్తీక్‌.

    English summary
    Nara Rohit is going to team up with director Parasuram once again. Nara Rohit will himself act in the second film that’ll be produced under his home production. With so many projects in hand, it looks like Nara Rohit has huge plans for 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X