twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అన్న’గారు వాడిని కిరీటాన్ని శ్రీరామ రాజ్యంలో బాలయ్య వాడారా..!

    By Sindhu
    |

    'శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు..వీళ్లందరూ ఎలా ఉంటారు? అని ఒక ప్రశ్న వేస్తే 'నందమూరి తారక రామారావు" చిత్రపటాలను చూపిస్తారు మన తెలుగు ప్రేక్షకులు. పౌరాణిక పాత్రల్లో ఆయన అంతగా ఒదిగిపోయారు. గంభీరమైన కంఠస్వరం, హుందాగా అగుపించే ఆహార్యం, అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఆయన వారసుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణకు కూడా పౌరాణిక పాత్రలంటే మహా ప్రీతి. అయితే నేటి తరంలో అలాంటి సినిమాలు తీసేవారు ఎవరు? అని ఒక ప్రశ్న వస్తే..ఒకరిద్దరు మినహా పెద్దగా కనిపించరు. ఆ ఒకరిద్దరు నిర్మాతల్లో 'యమంచిలి సాయిబాబు" ఒకరు. ఉత్తమాభిరుచి గల నిర్మాత కాబట్టే ఆయన 'శ్రీరామ రాజ్యం" లాంటి పౌరాణిక చిత్రానికి శ్రీకారం చుట్టారు.

    ఈ చిత్రంలో బాలకృష్ణను శ్రీరాముడిగా ఎన్నుకున్నారు. రాముడిగా తన తండ్రి అధ్బుతంగా నటించి ఉండటం వల్ల ఆయన్ను ఆదర్శంగా తీసుకుని బాలకృష్ణ ఈ పాత్రను ఎంతో ఇష్టపడి చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో వాల్మీకిగా డా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణుడిగా శ్రీకాంత్, సీతగా నయనతార, వశిష్టుడుగా సీనియర్ బాలయ్య, భూదేవిగా జయసుధ, చాకలి తిప్పనిగా బ్రహ్మానందం..ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

    'లవకుశ"లో వినుడి వినుడి శ్రీరాముని కథ.." పాట నేటికీ ఎవర్ గ్రీన్. ఈ పాటని మరపించే విధంగా 'శ్రీరామరాజ్యం"లోఒక పాట ఉంది. ఈ పాట మాత్రమే కాదు..మొత్తం అన్ని పాటలూ వీనుల విందుగా ఉంటాయని, ఆడియో సంచలనం విజయం సాధించడం ఖాయం అని ఈ చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇంకా ఈ సినిమాకి కనువిందు కలిగించే భారీ సెట్స్, నేటి తరం, రేపటి తరం, ఆ తర్వాతి తరం వారు రామాయణాన్ని గుర్తుంచుకోవాలనే ఆకాంక్షతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యలమంచిలి సాయిబాబు. దర్బారు, ఏకాంత మందిరం, సౌసల్య మందిరం, అయోధ్యనగరం నిర్మాణం..ఇలా సినిమా అంతా పలు సెట్స్ తో కనువిందుగా ఉంటుంది. అంతే కాదు అప్పట్లో లవకుశ సినిమాలో ఎన్టీఆర్ వాడిన ఆభరణాలను ఈ చిత్రంలో బాలయ్య వాడుతున్నారన్నదే ఆ వార్త. 'అన్న"గారు వాడిన నగల్లో ఆయన తనయుడు బాలయ్యను చూడడానికి నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

    English summary
    Nandamuri Balakrishna's upcoming mythological film titled 'Sri Rama Rajyam' is getting ready to release in September. Film makers are planning schedules to complete film by August. Currently film shooting is progressing at brisk pace in Ramoji Film City.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X