»   » వామ్మో ఆ డైరెక్టరా? జర జాగ్రత్త నాని.. నిన్ను కోరి ముందు ఫ్యాన్స్ ఆందోళన

వామ్మో ఆ డైరెక్టరా? జర జాగ్రత్త నాని.. నిన్ను కోరి ముందు ఫ్యాన్స్ ఆందోళన

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకొన్న నాని తాజాగా నిన్ను కోరి అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నివేద థామస్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ దర్శకుడు రూపొందించే చిత్రాన్ని అంగీకరించడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సముద్రఖనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్

సముద్రఖనితో సినిమాకు గ్రీన్ సిగ్నల్

తమిళంలో హీరో శశికుమార్, దర్శకుడు సముద్రఖని కాంబినేషన్‌లో ఓ సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా రూపొందించాలనే ప్లాన్ ఉన్నారు. తమిళంలో శశికుమార్ హీరో కాగా, తెలుగులో నాని అయితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారట. ఈ మేరకు నానితో వారు సంప్రదింపులు కొంతకాలంగా జరుపుతున్నారు. వారి ప్రతిపాదనకు నాని సానుకూలంగా స్పందించినట్టు వార్తలు బయటకు వచ్చాయి.


జెండాపై కపిరాజుతో చేదు అనుభవం

జెండాపై కపిరాజుతో చేదు అనుభవం

ఈ వార్తల నేపథ్యంలో నాని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాని సముద్రఖని దర్శకత్వంలో జెండా పై కపిరాజు చిత్రంలో నటించారు. ఆ చిత్రం నానికి అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. చివరికి విడుదలైన ఆ సినిమా దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకొన్నది. తన కెరీర్‌లో నానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.


మళ్లీ అదే రిపీట్ అయితే..

మళ్లీ అదే రిపీట్ అయితే..

జెండాపై కపిరాజు మిగిల్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నాని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. సముద్రఖని సినిమా గురించి ఓ సారి ఆలోచించాలని గుర్తు చేస్తున్నారట. అయితే ఇంకా ఆ సినిమా ఎలాంటి క్లారిటీ లేదనేది తాజా సమాచారం.


వేణు శ్రీరాంతో మిడిల్ క్లాస్ అబ్బాయి

వేణు శ్రీరాంతో మిడిల్ క్లాస్ అబ్బాయి

ఇదిలా ఉండగా వరుస సక్సెస్‌లతో జోరు మీద ఉన్న నాని ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో మిడిల్ క్లాస్ అబ్బాయి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి టాక్ వచ్చింది. మీడియాలో మంచి స్పందన కనిపిస్తున్నది. నిన్ను కోరి సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.


జాగ్రత్తగా చిత్రాల ఎంపిక..

జాగ్రత్తగా చిత్రాల ఎంపిక..

సినిమాలు, దర్శకుల ఎంపికపై ఇప్పటి వరకు నాని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వేణు శ్రీరాం సినిమా తర్వాత దర్శకులు మేర్లపాక గాంధీ, హను రాఘవపూడి చిత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఈ మధ్యలోనే సముద్రఖని సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుస విజయాలు ఖాతాలో పడుతున్న సమయంలో నాని తప్పుడు నిర్ణయం తీసుకొంటారా అనే ఆందోళనను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.English summary
Natural Star Nani is ready with his new film Ninnu Kori. The film stars Nani, Nivetha Thomas and Aadi Pinisetty in the lead roles. The makers are happy with the way the interest is generated on the film. There is a buzz that Director Samuthirakani are looking to shape a bi-lingual project and they might be roping in Nani for the Telugu version of the film. Already Nani worked with Samuthirakani in the film Jenda Pai Kapiraju. The film flopped at the box office. So this creating worry in Nani fans and the trade experts.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu