»   » తన గుట్టు బయట రానీయకుండా మీడియాకు లంచమిచ్చిన హీరో నవదీప్!?

తన గుట్టు బయట రానీయకుండా మీడియాకు లంచమిచ్చిన హీరో నవదీప్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోటశ్రీనివాస రావు కుమారుడు కోట ప్రసాద్ రేస్ బైక్ నుంచి పడి మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సిటీలో ఎక్కువ ట్రాఫిక్ ఉండటంతో ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, వాటిని నిర్మూలించుటకు సీరియస్ గా తగిన చర్యలు చేపడుతున్నారని సమాచారం. అయితే బంజార హిల్స్ లో బైక్ రేస్ లకు పెట్టింది పేరు. ఈ మద్య మరీ ఎక్కువయ్యాయని స్థానికుల సమాచారం. అయితే ఈ ఆదివారం(జూన్ 20)హీరో నవదీప్ తో పాటు మొత్తం ఆరుగురు అర్థరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ల పై బైక్ రేస్ పెట్టుకున్నారు. నవదీప్ తో పాటు అతని ప్రెండ్ ప్రసాద్, హీరోయిన్ శ్రద్దాదాస్, మరో ముగ్గురు..మొత్తం ఆరుమంది ఈ పోటీలో పాల్గొన్నారు. ఇలాంటి పోటీలు జూబ్లీహిల్స్ రోడ్లపై సెలబ్రిటీలు, వారి పిల్లలు నిత్యం జరుపుతూనే వుంటారు. మూడు బైక్ లతో సాగిన ఈ రేస్ సక్సెపుల్గా ఫుల్ జోష్ తోనే సాగిందట. కానీ వీరి రేస్ ని కెమెరాలో బంధించి ఆ తర్వాత కొన్ని పవర్ ఫుల్ న్యూస్ ఛానెల్స్ తమ టీవీల్లో ఒకే ఒకసారి చూపించడంతో హీరో నవదీప్ కి టెన్షన్ మొదలైందట.

అసలే మొన్న ఆ మద్య ఓ కేసులో ఇరుకున్న నవదీప్ ని మీడియా చెడమడా వాయించిన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ ఇలాంటివి బయటికెళ్లే తమ కెరీర్ మరింత కష్టం అవుతుందని భావించిన నవదీప్ ఆ ఛానెల్స్ లో ముఖ్యమైన వారిని సంప్రదించి బైక్ రేస్ కి సంబందించినవి టెలికాస్ట్ చెయ్యెద్దని, స్క్రోలింగ్ కూడా చేయొద్దని, టోటల్ గా దానికి సంబందించినవి బయటపెట్టొద్దని, వాళ్ళని ఒప్పించి ఒక లక్ష ఇరవైవేల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకున్నాడట. దాంతో నవదీస్ న్యూస్ ని హైడ్ చేసారట సదరు ఛానెల్స్ వారు. అంటే మీడియాని రూ. 1.20లక్షలకు నవదీప్ ఆ రోజు కొనుక్కున్నాడన్న మాట.

మరైతే నవదీప్ లాంటి వ్యక్తులు తమ వార్తలు రాకుండా చూసుకోవడానికి ఎవరెవరుఎంతెంత ఇచ్చి రాజీ కుదర్చుకుంటున్నారో వారికే తెలియాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu