»   » చిరు 150 అనగానే..పెంచేసింది

చిరు 150 అనగానే..పెంచేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 150వ సినిమా అంటే ఓ రేంజిలో క్రేజ్ ఉంది. దాంతో ఈ చిత్రంలో ఎవరెవరు నటించనున్నారు. ఏయే టెక్నిషియన్స్ పనిచేయనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. మరో ప్రక్క ఈ క్రేజ్ కు తగ్గట్లే తమ రెమ్యునేషన్స్ సైతం పెంచి ఆర్టిస్టులు అడుగుతున్నట్లు సమాచారం. అంత క్రేజ్ ఉన్న ప్రాజెక్టులో చేసేటప్పుడు ఆ మాత్రం అడగటంలో తప్పేమిలేదని వారు సమర్దించుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ వంతు నయనతార దగ్గరకు వచ్చి ఆగింది.

ఈ చిత్రం కోసం హీరోయిన్ గా చాలా మందిని అనుకున్నారు. కాని ఈ సినిమాకు వినాయక్ కు కలిసొచ్చిన నయనతారనే హీరోయిన్ గా తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాకు నయనతార రెండున్నర కోట్లా రూపాయలు ఆశిస్తుందని తెలుస్తోంది. చిరు 150 సినిమా అని మాత్రమే కాక, 2015లో తనకు లభించిన హిట్సే కారణం అంటున్నాయి సినిమా వర్గాలు.

Nayan demands high for Chiranjeevi 150

దీనికి కారణంగా, వినాయక్ డైరక్షన్ లోవచ్చిన యోగి, లక్ష్మి, తులసి, అదుర్స్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి హిట్ సొంతం చేసుకోవడమే అని అనుకుంటున్నారు. నయనతారను కావాలనే సెలక్ట్ చేసారని ఫిల్మ్ నగర్ సమాచారం.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు? అనేది చాలా కాలంగా హాట్ టాపిక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార హీరోయిన్ గా ఖరారైనట్లు సమాచారం. ఆమె అయితేనే చిరంజీవికి పర్ ఫెక్టుగా సెట్టవుతుందని భావిస్తున్నారట. ఫ్యాన్స్ కూడా నయనతార ఎంపికపై సంతృప్తిగానే ఉన్నారు.

Nayan demands high for Chiranjeevi 150

ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చిరంజీవి తనయుడు, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా చేపట్టారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సహ నిర్మాణ సంస్థ వ్యవహరిస్తోంది. వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్న చిరంజీవి 150వ సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు చిరంజీవి తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం.

రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్ వారు ఈ విషయమై చర్చించి రూ. 30 కోట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రూ. 15 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. ఈ సినిమా తమిళ సినిమా కత్తి రీమేక్ అని తెలిసిందే. దీనికి తమిళ వెర్షన్ కి మురుగుదాస్ డైరక్షన్ చేసారు. అక్కడ 2015 సంవత్సరంలో సూపర్ హిట్ అయ్యింది.

English summary
Nayanthara is demanding Rs.2.5 crores as remuneration for remake of Kaththi with Chiranjeevi under VV Vinayak direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu