»   » కోరిక తీరెన్ : అక్షయ్ భార్యగా నటిస్తున్న నయనతార!

కోరిక తీరెన్ : అక్షయ్ భార్యగా నటిస్తున్న నయనతార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన నయనతార...చంద్రముఖి సినిమాలో రజినీ సరసన అవకాశం కొట్టేసి సౌతిండియా టాప్ హీరోయిన్‌గా ఎదిగి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ వూపు ఊపింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టి తన సత్తా చాటుదాము అనుకునే సరికి....ప్రభుదేవాతో పరిచయం, ప్రేమాయణం, కోర్టు చిక్కులు, ఆయనతో పెళ్లికి సిద్ధం అవడం జరిగింది. దీంతో శ్రీరామరాజ్యం సినిమానే తన చివరి సినిమా, తనకు నటించాలని ఉన్నా ప్రభుదేవా ఒప్పుకోడు అంటూ కన్నీళ్లతో తన సీని కెరీర్‌కు వీడ్కోలు పలికింది నయన. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ లో నటించాలనే నయనతార ఆశలు అడియాశలుగానే మిగిలి పోయాయి.

బాలీవుడ్ లో నటించాలనే నయన కోరికను తెలుసుకున్న ప్రభుదేవా ఆమెకు బాలీవుడ్ ఆవకాశం కల్పించే పనిలో పడ్డాడు. అది కూడా తను దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనే . తెలుగులో వచ్చిన విక్రమార్కుడు సినిమాకు రీమేక్ గా హిందీలో అక్షయ్ కుమార్ హీరోగాః 'రౌడీ రాథోడ్" సినిమాను తెరకెక్కిస్తున్న ప్రభు... తెలుగు విక్రమార్కుడు లో విక్రమ్ సింగ్ రాథోడ్(రవితేజ) భార్యగా ఫోటోకే పరిమితమైన జ్యోతిక పాత్రను నయనతో చేయించాలని నిర్ణయించాడట. తెలుగు వెర్షన్ లో ఫోటోకే పరిమితం అయిన జ్యోతిక పాత్రను హిందీలో తన క్రియేటివిటీకి మెరుగులు పెట్టి అక్షయ్ కుమార్ భార్యగా నటనకు ప్రాధాన్యం ఉండేలా నయన పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఏమైతేనేం...నయన కోరిక తీరబోతోంది, బాలీవుడ్ సినిమాలో హీరో అక్షయ్ కుమార్ భార్యగా హీరోయిన్ తర్వాత హీరోయిన్ అంతటి పాత్ర చేయబోతోంది. అదీ మ్యాటర్.

English summary
Nayanatara is entering to bollywood. She will play a guest roll in rowdy rathode.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu