»   » నయనతారపై మరో షాకింగ్ రూమర్!

నయనతారపై మరో షాకింగ్ రూమర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి, ఆమెపై ఎప్పుడూ ప్రచారంలో ఉండే రూమర్స్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా నయనతార గురించి మరో షాకింగ్ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఆమె రెండు గంటల్లో రూ. 4 కోట్లు సంపాదించిందనే ప్రచారం మొదలైంది.

నయనతార ప్రస్తుతం ఒక్కోసినిమాకు దాదాపుగా కోటిన్నర వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. అయితే యాడ్ లు, షాప్ ఓపెనింగ్స్ పరంగా కూడా నయన్ ఇదే ఫార్ములా అప్లై చేస్తోందట. రీసెంట్ గా నయనతార ఓ నగల దుకాణం ఓపెనింగ్ కు అటెండ్ అయింది. ఆ షాప్ ప్రారంబోత్సవంలో పాల్గొని ఓ రెండు గంటలు గడిపిన నయన్ రూ. 4 కోట్లు తీసుకున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయం విని అంతా షాకవుతున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

Nayanatara demands 4cr for an ad

వచ్చే ఏడాది బాయ్ ఫ్రెండుతో పెళ్లి?
ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వీరు చివరి నిమిషయంలో విడిపోయారు. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది నయనతార. 'నానుం రౌడీ దాన్‌' చిత్రంలో నటించిన నయనతార ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిందని, ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. పెళ్లి విషయం ఖండించినా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని అంటున్నారు.

గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారంలో నయనతారకు కొన్ని షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే విఘ్నేష్ శివన్ ప్రేమ వ్యవహారం విషయంలో ఆమె గోప్యత పాటిస్తోందని ఆమె సన్నిహితులు అంటున్నారు. వచ్చే ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నాు. అయితే చివరి నిమిషం వరకు ఇద్దరూ తమ బంధాన్ని రహస్యంగానే కొనసాగించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం నయనతార నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తమ పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకున్నారని, 2016లో ఈ ఇద్దరూ ఒక్కటయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Tamil film source said that, Nayanatara demands 4cr for an ad.
Please Wait while comments are loading...