»   » వామ్మో.. సంఘమిత్రలో ఆ క్రేజీ స్టారా? మెప్పిస్తుందా? .. పోస్టరే కొంప ముంచిందట..!

వామ్మో.. సంఘమిత్రలో ఆ క్రేజీ స్టారా? మెప్పిస్తుందా? .. పోస్టరే కొంప ముంచిందట..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంఘమిత్ర చిత్ర షూటింగ్ ప్రారంభానికి ముందే సంచలనలకు, వివాదాలకు వేదికవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేశారు. విదేశీ సినీ పండుగ వాతావరణంలో సంఘమిత్ర ప్రమోషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. కేన్స్‌లో జరిగిన హంగామాకు సంఘమిత్ర పాత్రధారి శృతిహాసన్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ సంఘమిత్ర యూనిట్‌లో గందరగోళానికి కారణమైందనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

శృతిహాసన్ తప్పుకోవడంతో..

శృతిహాసన్ తప్పుకోవడంతో..

శృతిహాసన్‌ హీరోయిన్‌గా ‘సంఘమిత్ర' సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకుడు సుందర్ ప్రకటించగానే తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ప్రారంభానికి ముందే కత్తిసాము, యుద్ధ పోరాటాలకు సంబంధించిన విద్యలను శిక్షణ పొందింది. ఇలాంటి అనేక అంశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. బాహుబలి తర్వాత అంతటి రేంజ్ ఉన్న చిత్రమువుతుందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకోవడంతో సంఘమిత్ర సెట్స్‌పైకి వెళ్తుందా అనే మాట బలంగా వినిపించింది.

ఫస్ట్ లుక్ కారణమట..

ఫస్ట్ లుక్ కారణమట..

సంఘమిత్ర నుంచి శృతిహాసన్ తప్పుకోవడానికి కేన్స్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టరట. ఆ పోస్టర్‌ను చూసి జనాలు ముక్కున వేలేసుకోవడంతో శృతిహాసన్ కంగుతిన్నదట. ఆ పోస్టర్‌పై దారుణమైన కామెంట్లు రావడంతో శృతి మనస్తాపానికి గురిందైంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది శృతిహాసన్ కాకపోవడంతో పోస్టర్‌పై చాలా విమర్శలు గుప్పించారు. కేన్స్ లాంటి వేదికలపై ఆవిష్కరించిన పోస్టర్‌లో తాను లేకపోవడం, పెయింటింగ్ చేయించడం ఆమె ఆగ్రహానికి కారణమైందట.

స్క్రిప్టు సరిగా లేదన్న కారణంతో..

స్క్రిప్టు సరిగా లేదన్న కారణంతో..

దాంతో స్క్రిప్టు సరిగా లేదని, ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి చాలా లేటు అవుతుందనే కారణాలను వెల్లడిస్తూ సంఘమిత్ర నుంచి శృతిహాసన్ తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల డేట్లు ఇమ్మంటున్నారనీ, అది కుదరకనే తప్పుకున్నాని శృతి చెప్పిన మాటలలపై అనేక సందేహాలు తలెత్తాయి. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న కారణంతోనే శృతి అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

నయనతారను తీసుకొన్న నిర్మాతలు

నయనతారను తీసుకొన్న నిర్మాతలు

ఇదిలా ఉండగా, శృతిహాసన్ తప్పుకోవడంతో హన్సిక, అనుష్క, నయనతార, తమన్నా లాంటి తారల పేర్లు పరిశీలనకు వచ్చాయి. హన్సికకు తెలుగు, తమిళ భాషల్లో మార్కెట్ అంతగా లేకపోవడం వల్ల బిజినెస్ అవుతుందా? క్రేజీ ప్రాజెక్ట్‌కు సరిపోయే సత్తా హన్సికలో ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అనుష్కను నిర్మాతలు సంప్రదించినా ఏ కారణంగానో వర్కవుట్ కాలేదు. తమన్నాకు కూడా మార్కెట్ అంశం ఓ అడ్డంకిగా మారింది. దాంతో నయనతార సరైన వ్యక్తి అని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారనేది తాజా సమాచారం.

నయనతార మెప్పిస్తుందా..

నయనతార మెప్పిస్తుందా..

గ్లామర్ తారగానే కాకుండా మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ నయనతార ప్రశంసలు అందుకొంటున్నది. ఇటీవల వచ్చిన సినిమాలను నయనతార ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లింది. ప్రొఫెషనల్‌గా నయనతార వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది నిర్మాతల అభిప్రాయం. రెండేళ్ల ప్రాజెక్ట్ కావడంతో చెంచల స్వభావంలేని, స్థిరత్వం కలిగిన హీరోయిన్‌గా పేరున్న నయనతారను ఓకే చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
Reports suggest that after Shruti Haasan exit, Nayanatara entered into Sangamitra Project. Soon, producers to announce officially about Nayanatara entry. There rumour viraling in media that.. because of First look, which released in Cannes was main reason behind the Shruti Haasan left.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu