For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయనతార-విఘ్నేశ్ శివన్ బ్రేకప్.. ఒంటరిగానే లేడీ సూపర్ స్టార్

  |

  నయనతార మళ్లీ ఒంటరైందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సినిమాలతో ఎంత ఫేమస్ అయిందో.. వ్యక్తిగత విషయాలతో అంతకు రెట్టింపు వైరల్ అయింది లేడీ సూపర్ స్టార్. గతంలో శింబుతో ప్రేమ, ప్రభుదేవాతో పెళ్లి పీటల వరకు వెళ్లి వెనుదిరిగి రావడం, మళ్లీ యంగ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణం సాగించడం అందరికీ తెలిసిందే. అయితే విఘ్నేశ్ శివన్‌తో కూడా నయన్‌కు దూరం పెరిగిందనే వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి.

  విదేశాల్లో జంట పక్షులు..

  విదేశాల్లో జంట పక్షులు..

  నయన్-విఘ్నేశ్ ఇద్దరూ కలిసి జంటపక్షుల్లా దేశవిదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తమ పుట్టిన రోజు వచ్చినా విదేశాల్లో వాలిపోయి ఎంజాయ్‌ చేస్తారు. అక్కడ వారు తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ అప్‌డేట్లు ఇస్తూ ఉంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్‌ ఇలా ఎలాంటి వేడుక వచ్చినా విదేశాల్లోనూ మకాం వేస్తుంటారు. విహరించేస్తున్నారు. గత క్రిస్మస్‌ పండగకు కూడా యూఎస్‌కు వెళ్లారు. అదే విధంగా 2020 నూతన సంవత్సరం కూడా విదేశాల్లో గడుపుకోవడానికి వెళ్లారు.

  సింగిల్ ఫోటోలే..

  సింగిల్ ఫోటోలే..

  అయితే అక్కడ నయనతార తాను సింగిల్‌గా తీసుకున్న ఫొటోలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పుడు దీని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు గానీ, తాజా పరిణామాలతో నయనతార మూడో ప్రేమ కథ కూడా కంచికి చేరిందనే ప్రచారం ఊపందుకుంది. ఈ విదేశీ పయనంలో నయనతారకు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, అందుకు కారణం విఘ్నేశ్‌ శివన్‌ పెళ్లి ప్రస్తావన తీసుకురావడమేనని టాక్.

  పెళ్లిగోల..

  పెళ్లిగోల..

  నిజానికి వీరిద్దరి మధ్య పెళ్లి గొడవ చాలా కాలంగానే నానుతోంది. విఘ్నేశ్‌ శివన్‌ ఇంట్లో ఆయనపై పెళ్లి ఒత్తిడి పెరుగుతోందనే ప్రచారం జరిగింది. కాగా నయనతార మరి కొద్ది కాలం పెళ్లిని దూరంగా పెడదామని చెప్పడంతో సైలెంట్ అయిపోయాడని తెలుస్తోంది. ఏదేమైనా నయనతార, విఘ్నేశ్‌శివన్‌ ఇటీవల కాలంలో పలు దేవాలయాలకు వెళ్లి విశేష పూజలు నిర్వహించారు. దోష పరిహార పూజలు చేయడంతో పెళ్లి కోసమే ఈ దైవానుగ్రహ పూజలు అని అందరూ అనుకున్నారు.

  పెళ్లిపై అయిష్టత..

  పెళ్లిపై అయిష్టత..

  కాగా తాజాగా విఘ్నేశ్‌ శివన్‌ మరోసారి నయనతారపై పెళ్లి ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతున్న నయనతార పెళ్లి చేసుకుంటే ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందనే భయమో లేక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేకనో విఘ్నేశ్‌శివన్‌తో పెళ్లికి అయిష్టతను వ్యక్తం చేసినట్లు సమాచారం.

  విఘ్నేశ్ శివన్‌కు సలహా..

  విఘ్నేశ్ శివన్‌కు సలహా..

  అంతే కాదు తనతో కలిసి తిరుగుతూ నీలోని ప్రతిభకు పదును పెట్టకుండా అవకాశాలను కోల్పోకు అని సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో కోపగించుకున్న విఘ్నేశ్‌శివన్‌ వెంటనే పెట్టె బేడా సర్దుకుని విదేశం నుంచి తిరిగొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నటిగా నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోవడం ఇష్టం లేకే నయనతార విఘ్నేశ్‌ శివన్‌ను వదిలించుకున్నట్లు టాక్‌.

  జీ సినీ అవార్డుల్లో ఒంటరిగానే..

  జీ సినీ అవార్డుల్లో ఒంటరిగానే..

  సినీ ఫంక్షన్లకు అరుదుగా వచ్చే నయన్.. విఘ్నేశ్ శివన్‌ను వెంటబెట్టుకుని వస్తుంది. అయితే తాజాగా జరిగిన జీ సినీ అవార్డు కార్యక్రమంలో మాత్రం నయన్ సింగిల్‌గానే మెరిసింది. ఈ వేడుకల్లో నయన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. ఆమె వెంట ప్రియుడు లేకపోవడం ఈ వార్తలకు కారణభూతమైంది. మరి వీటిపై నయన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

  English summary
  Nayanathara Break Up With Vignesh Shivan. Buzz Is That Theer Is Distance Between Nayanathara And Vignesh Shivan. She Alone Participated In ZeeCine Awards.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X