For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బాబు బంగారం' లేటుకు కారణంగా నన్ను బ్లేమ్ చేయద్దు

  By Srikanya
  |

  హైదరాబాద్:సాధారణంగా వయసు మీదపడేకొద్దీ సినిమాలో సీనియారిటీ పెరిగేకొద్ది హీరోయిన్స్ మార్కెట్‌ కూడా తగ్గుముఖం పడుతుంది. కానీ ఆ తరహా హీరోయిన్స్ కు పూర్తి భిన్నమైన నటి నయనతార. ఆమె కు వయస్సు పెరిగే కొలిదీ డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఆమె వెంకటేష్ సరసన మారుతి దర్శకత్వం లో బాబు బంగారం చిత్రం చేస్తోంది.

  అయితే ఈ చిత్రం విషయంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నయనతార నిర్మాతతో డేట్స్ విషయమై సహకరించటం లేదని, అందుకే బాబు బంగారం లేటు అవుతోందనీను, ఈ విషయమై నయనతార క్లారిఫికేషన్ ఇచ్చింది. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది.

  నయనతార మాట్లాడుతూ...తాను ఎగ్రిమెంట్ ప్రకారం డేట్స్ కేటాయించానని, ఆ డేట్స్ లో వాళ్లు సినిమా కంప్లీట్ చేసుకోకపోతే తన తప్పేమీ కాదని అంది. ప్లానింగ్ ప్రకారం తనతో సీన్స్ పూర్తి చేసుకోలేదని ఆమె అంది. నిర్మాతలు ఈ చిత్రం కోసం మరిన్ని డేట్స్ కావాలని సంప్రదించినప్పుడు తాను కన్వీన్స్ అయ్యి, మరో పది రోజులు ఇచ్చానని, అయినా సరే ప్రాజెక్టు పూర్తి చేయలేదని చెప్పినట్లు సమాచారం. అందుకే ఈ ప్రాజెక్టు డిలే విషయంలో తనను తప్పు పట్టవ్దదని అంది.

  Nayantara about Babu Bangaram False Propaganda!

  ఇక తాను ప్రొపిషనల్ అని, టైమ్ ప్రకారం వచ్చి వెళ్తానని, ఎగ్రిమెంట్ ని ఫాలో అవుతానని చెప్పుకొచ్చింది. తనపై నిర్మాతకు సహకరించటం లేదనే ఫాల్స్ ప్రాపగాండ జరుగుతోందని అని విచారం వెళ్లబుచ్చింది.

  మరో ప్రక్క "కేవలం ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది వెంకటేష్, నయనతారలపై. అది ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తాం. మిగతా షూటింగ్ అంతా పూర్తైంది. పెండింగ్ ఏమి లేదు. కాబట్టి రిలీజ్ విషయంలో డిలే ఏమీ ఉండదు. జూలై 29 అని మొదట అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తాం ," అని ప్రొడక్షన్ హౌస్ కు చెందిన వారు అంటున్నారు.

  వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బాబు బంగారం'. కంటిన్యూ షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేష్ పోలీసు అధికారిగా వినోదాత్మకమైన పాత్రలో కనిపిస్తున్నారు. వెంకటేష్ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ విడుదలై అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఇక సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు టీమ్, ఈ రోజు మందుగా ప్రకటించినట్లుగానే ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసింది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

  నయనతార మిగతా చిత్రాల విషయానికి వస్తే.... ప్రస్తుతం విక్రంతో 'ఇరుముగన్‌', కార్తితో 'కాష్మోరా' నటిస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త, జూనియర్‌ హీరోలతో జతకట్టాలంటే కొన్ని కండీషన్స్ తప్పవని చెబుతోంది నయనతార. కథ తన పాత్రను ఆధారంగా చేసుకునే ఉండాలని చెబుతోందట.

  'నానుం రౌడీదాన్‌'లో మాదిరిగా హీరోయిన్ కీలకంగా ఉండే కథకే తాను ప్రాధాన్యత ఇస్తానని కూడా తేల్చిచెప్పిందట. దీంతో నయనతారే తమ సినిమాకు హీరోయిన్‌గా ఉండాలని భావించే యంగ్ హీరోలు, దర్శకులు కథలో కాస్త మార్పులు, చేర్పులు చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా నటనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే షరతు పెడుతున్నట్లు చెబుతున్నారు.

  English summary
  Nayantara has broken her silence and refuted the rumours. Clarifying on them, Nayan said that she has allotted her dates to the film as per the agreement and she shouldn't be blamed if movie isn't completed as per the schedule and is delayed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X