»   » ‘చంద్రముఖీ 2’ హీరో వెంకటేష్ మరి హీరోయిన్ నయనాతార?సమీరారెడ్డి?

‘చంద్రముఖీ 2’ హీరో వెంకటేష్ మరి హీరోయిన్ నయనాతార?సమీరారెడ్డి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ గత కొన్ని రోజులుగా నలుగుతున్న విషయానికి తెరపడింది. పి వాసు కన్నడంలో రూపొందించిన 'ఆప్తరక్షక"ను తెలుగులో 'చంద్రముఖి2" సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడనీ, ఈ చిత్రాన్ని తానే తెలుగులో నిర్మిస్తున్నాననీ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిన్న క్లియర్ సర్టిఫికెట్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇక, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయమై భిన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. 'చంద్రముఖి"లో నటించిన నయనతారను 'చంద్రముఖి 2"లో కొనసాగించాలని దర్శకుడు పి. వాసు యోచిస్తున్నాడట.

మరి సెకెండ్ హీరోయిన్ గా సమీరారెడ్డికి ఛాన్సివ్వాలని పి. వాసు ఫిక్సయినట్లు సమాచారం. గతంలో వెంకటేష్ సరసన 'లక్ష్మీ", 'తులసి" చిత్రాల్లో వెంకీ, నయనతార కలిసి నటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అన్న కోణంలో ఈ కాంబినేషన్ కి నిర్మాత బెల్లంకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట కూడా. ఈ మధ్య తమిళంలో రజనీకాంత్ సరసన సమీరారెడ్డి నటిస్తుందని తెలిసిన తరుణంలో ఆమెను తీసుకోవాలా వద్దా అని, అయితే టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సమీరారెడ్డి విషయంలోనే ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతోందట. ఏదేమైనా విక్టరీ సరసన ఎవరు చేస్తున్నారనేది తెలియని సస్సెన్స్ గా మారింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu