»   »  నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్న నయనతార

నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్న నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెకండ్ ఇన్నింగ్స్ లోనూ నయనతార కెరీర్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇపుడు ఆమెకు తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె దాదాపు అరడజను తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్లలో ఆమె కూడా ఒకరుగా ఉన్నారు.

ఇటీవల చెన్నైకి చెందిన ఓ జ్యువెలరీ బ్రాండ్ ఆమెను ప్రచారకర్తగా నియమించుకోవడానికి సంప్రదించిందట. ఆమెతో ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరించాలని ప్లాన్ చేసారు. ఇందుకోసం రెండు రోజుల షూటింగుకు డేట్స్ అడిగారు. మొత్తం ఈ డీల్‌కు గాను నయనతార రూ. 4 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

సదరు జ్యువెలరీ బ్రాండ్....నయనతారకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె అడిగిన మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఇపుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

 Nayantara

త్వరలో నయనతార తెలుగు ప్రేక్షకుల ముందుకు...
‘ఓకె ఓకె' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్‌, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఇదు కదిర్‌వేలన్‌ కాదల్‌'. తమిళంలో దాదాపు 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఘన విజయం సొంతం చేసుకొన్న ఈ చిత్రాన్ని ‘శీనుగాడి లవ్‌స్టోరి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.

పలువురు నిర్మాతలు ఈ చిత్రం డబ్బింగ్‌ రైట్స్‌ కోసం పోటిపడినప్పటికీ భారీ మొత్తాన్ని చెల్లించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రం రైట్స్‌ సొంతం చేసుకొన్నారు. కె.సూర్యారావు సమర్పిస్తున్న ఈ చిత్రంలో సంతానం, శరణ్య, ఛాయాసింగ్‌, హైద్రాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో ప్రముఖ డాక్టర్‌ అయిన భరత్‌రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంగీత సంచలనం హేరిస్‌ జైరాజ్‌ స్వరసారధ్యం వహించిన చిత్రానికి ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌ దర్శకుడు.

ఈ చిత్రం గురించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ‘ప్రేమకథా చిత్రాలను ఆదరించే వారందర్నీ అమితంగా ఆకట్టుకొనే ఈ చిత్రం నయనతార ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. హేరిస్‌ జైరాజ్‌ అందించిన బాణీలు తమిళంలో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంతానంతో కలిసి ఉదయనిధి స్టాలిన్‌ చేసే కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెలాఖరుకు ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

ఉదయనిధి స్టాలిన్‌, నయనతార, శరణ్య, ఛాయాసింగ్‌, డా॥భరత్‌రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, ఛాయాగ్రహణం: బాలసుబ్రమణియం, సమర్పణ: ‘పద్మశ్రీ' పురస్కార గ్రహీత డా॥కె.సూర్యారావు, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌.

English summary
Recently a Chennai based Jewelry brand approached Nayantara for a ad film shoot. The commercial shoot require Nayantara to shoot for two nights and she demanded a whopping 4 Crore for the work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu