»   » విక్రమ్‌తో నయనతార లిప్ లాక్ సీన్లు, హాట్ రొమాన్స్!

విక్రమ్‌తో నయనతార లిప్ లాక్ సీన్లు, హాట్ రొమాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విక్రమ్, నయనతార హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'ఇరుమురుగన్'. సినిమాకు సంబంధించిన ఇతర విషయాల సంగతి పక్కన పెడితే...ఈ చిత్రంలో నయనతార చాలా హాట్‌హాట్‌గా కనిపించనుందనే విషయం చర్చనీయాంశం అయింది. గతంతో పోలిస్తే సెకండ్ ఇన్నింగ్స్‌లో నయనతార హాట్ గా కనిపించడం తగ్గించింది. అయితే ఈ చిత్రంలో మాత్రం ఆమె మళ్లీ తన గ్లామర్ విశ్వరూపం చూపించబోతోందని, బికినీ సీన్లు, ముద్దు సీన్లతో వెండితెరను మరోసారి వేడెక్కించబోతోందని అంటున్నారు.

నయనతార గ్లామర్ ఇష్యూ పక్కన పెట్టి సినిమాకు సంబంధించిన విషయంలోకి వెళితే...ఆనంద్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'ఇరు ముగన్' సినిమాలో విక్రమ్ సరికొత్తగా కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ ఎవరూ ఊహించని విధంగా డిఫరెంటుగా ఉంది. ఈ చిత్రంలో విక్రమ్ రెండు డిపరెంట్ క్యారెక్టర్లలో కనిపిస్తారట.

nayantara

ఈ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార, నిత్యా మీనన్ నటిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శిబు థమీన్స్ నిర్మాత. సినిమా తొలి షెడ్యూల్ మలేషియాలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో విక్రమ్ కు పెద్ద హిట్స్ ఏమీ లేవు. గతేడాది శంకర్ దర్శకత్వంలో చేసిన 'ఐ' చిత్రం కలెక్షన్లు రాబట్టినప్పటికీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో 2016లో ఓ భారీ విజయం తన ఖాతాలో వేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు విక్రమ్.

English summary
Nayantara Hot Bikini show in movie Iru Mugan. Nayantara reportedly is playing a secret agent in Vikram-starrer upcoming Tamil thriller “Iru Mugan”, a source said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu