బాలకృష్ణ శ్రీరామరాజ్యం కు సీత విషయంలో మళ్శీ మొదలైన కష్టాలు..!
బాపు దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న చిత్రం శ్రీరామరాజ్యం. ఈ పౌరాణిక చిత్రంలో బాలయ్యబాబు రాముడిగా నటిస్తుండగా సీత పాత్రకోసం మొట్టమొదట నయనతారని ఎంపిక చేసుకున్నారన్న విషయం అందరికి తెలసిందే. ఐతే ప్రభుదేవాతో నయనతార ప్రేమవ్యవహారం రోజుకో మలుపు తిరగడంతో అటుతెలుగులోను, తమిళంలోను నయనతారకు చాలా చెడ్డపేరురావడం జరిగింది. దాంతో సీత పాత్ర కోసం నయనతారను ఎంపిక చేయడం విమర్శలకు గురిఅవుతుందనే భయంతో నయనతారను సీతగా ఉపసంహారించుకున్నారని ఫిలంనగర్ లో సమాచారం.
ఐతే నయనతార మేనేజర్ మాత్రం వేరేలా మాట్లాడుతున్నాడు. శ్రీరామరాజ్యంకి సంబంధించి ఇప్పటివరకూ మమ్మల్ని ఎవరూ కలవలేదని, అంతేకాకుండా ఆసినిమాకి ఇంకా నయనతార అంగీకరించలేదని అన్నారు. అసలు అంగీకరించని చిత్రాన్ని ఎలా కాన్స్లిల్ చేశారని ఎవరో నయనతార గిట్టని వారు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా తన కాపురంలో నిప్పులు పోస్తుందంటూ నయనతారపై ప్రభుదేవా భార్య రమాలత్ ఇప్పటికే నిప్పులు తోక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇలాంటి పరిస్దితుల్లో నయనతారను సీతగా తీసుకోవడం ఇష్టంలేక బాపు మరో సీతకోసం చూస్తున్నట్లు వినికిడి.


Click it and Unblock the Notifications











