»   » నటి కుమారుడితో నయనతార పెళ్లి ఫిక్స్: ఎవరతను?

నటి కుమారుడితో నయనతార పెళ్లి ఫిక్స్: ఎవరతను?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కేరళ కుట్టి నయన తారపై పుకార్లు ఎప్పటికీ షికార్లు చేస్తూనే ఉంటాయి. తాజాగా, మరో పుకారు షికారు చేస్తోంది. ఆమె ఓ తమిళ నటి కోడలు అవుతోందని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ తమిళ నటి ఎవరు, నయనతార పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు అనే విషయంపై ఊహాగానాలకు రెక్కలు వచ్చాయి.

రెండు సార్లు ప్రేమలో పడి ఓడిపోయిన నయనతార నిబ్బరంగానే తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నది. జీవితంలో తీవ్రమైన రెండు ఇబ్బందులను చవి చూసినా ఆమె సినీ జీవితం సజావుగానే సాగుతోంది. సూర్య, కార్తీ వంటి సీనియర్ నటులతో పాటు విజయసేతుపతి వరకు ప్రముఖ, యువనటులతో ఆమె నటిస్తూనే ఉన్నది.

Nayantara Tara marriage fixed?

కార్తి సరసన ఆమె త్వరలో కాష్మారో అనే సినిమాలో నటించబోతోంది. ఇప్పటికే సూర్యతో కలిసి ఓ మాస్ సినిమాలో నటిస్తోంది.

షూటింగ్ అయిపోగానే ఎవరితోనూ మాట్లాడకుండా హోటల్ గదికి వెళ్లిపోయే నయనతార ఈ మధ్య చిత్రం యూనిట్ సభ్యులతో సరదాగా ఉంటున్నారట. సక్సెస్ అయిన తన సినిమాల్లో నటించిన తారలతో ఆమె ముచ్చట్లు కూడా పెడుతున్నారని అంటున్నారు.

ఆ మార్పు రావడానికి కారణం ఆమె పెళ్లి సెటిల్ కావడమేనని అంటున్నారు. ఖుష్బూ మాదిరిగానే ఆమె కూడా ఓ తమిళ నటి కోడలు కాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఆ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనేది ఇప్పుడే తేలే విషయం కాదు.

English summary
Tamil film industry buz is that actress Nayana tara is going to marry a Tamil actress son.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu