»   » ఓనం సాక్షిగా: నయనతార అతనితోనే జీవిస్తోంది... (ఫోటోస్)

ఓనం సాక్షిగా: నయనతార అతనితోనే జీవిస్తోంది... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ బ్యూటీ నయనతార ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్నా... తర్వాత తనకంటూ ఓ తోడు వెతుక్కుందని, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోందని తమిళ మీడియాలో చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.

ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. పెళ్లి విషయం ఖండించినా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య నయనతా ఎక్కడికెళ్లినా అతనితోనే కలిసి వెలుతోంది.

కేరళకు చెందిన నయనతార తాజాగా ఓనం పండుగను కూడా తన ప్రియుడితోనే కలిసి జరుపుకుంది. ఓనం పండగ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను కూడా పోస్టు చేసారు. ఒక పెళ్లి కాని మహిళతో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నాడంటే ఆమె మనసుకు బాగా నచ్చిన వాడని అర్థం... అలాంటి వ్యక్తిని వ్యవహారిక బాషలో ప్రియుడు లేదా ప్రేమికుడు అంటారు. కాదంటారా?

ఈ పండుగను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోవాలని సొంతూరు వెళ్ళింది నయన్. ఒంటరిగా కాకుండా... ప్రియుడు విగ్నేష్ శివన్ వెంటబెట్టుకొని మరీ వెళ్లింది. సో... నయనతార కుటుంబ సభ్యులకు కూడా ఇతగాడు బాగా నచ్చాడని టాక్.

అతనితోనే జీవిస్తోందా?

అతనితోనే జీవిస్తోందా?

ప్రస్తుతం నయనతార సినిమాలతో బిజీగా ఉంటోంది. అయితే చెన్నైలో ఉన్నపుడు తన ఖాళీ సమయం అంతా విఘ్నేష్ శివన్ తోనే గడుపుతోందట. ఒకే ఇంట్లో ఉండక పోయినా అతనితో కలిసి జీవిస్తోందన్నమాట.

వాళ్ల దృష్టిలో లోకులు కాకులు

వాళ్ల దృష్టిలో లోకులు కాకులు

ప్రేమికుల దృష్టిలో లోకులు కాకులు. అందుకే వాళ్లేమన్నా పట్టించుకోరు. నయన, విఘ్నేష్ కూడా ఇపుడు అదే ఫాలోఅవుతున్నారు. తమనకు నచ్చినట్లుగా ఉంటున్నారు. అందుకే బయట వీరిపై ఎలాంటి ప్రచారం జరుగుతున్నా ఉలుకు పలుకు లేదు.

సహజీవనం తర్వాతే

సహజీవనం తర్వాతే

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం అని నమ్మే తత్వం ఇద్దరిదీ. అయితే జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఇద్దరూ సహజీవనం.. కాదు కాదు.. కలిసి జీవిస్తున్నారు.

త్వరలో వివాహం

త్వరలో వివాహం

కొంత కాలం పాటు ప్రేమ సాగరంలో మునిగి తేలిన తర్వాతే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అప్పటి వరకు రిలేషన్ షిప్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే సరి. ఏ విషయంలో ఇద్దరికీ నచ్చక పోయినా విడిపోతారు. అయితే అలా జరిగే అవాకశం మాత్రం కనిపించడం లేదు. విఘ్నేష్ తో నయనతార పెళ్లి దాదాపుగా ఓకే అయ్యే అవకాశం ఉంది.

గతంలో శింబుతో

గతంలో శింబుతో

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలతో ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో శింబుతో నయనతార లవ్వాయణం, ఇద్దరి చాటు మాటు రొమాన్స్ ఫోటోస్ లీక్ అవ్వడం అప్పట్లో ఓ సెన్సేషన్.

ప్రభుదేవాతో..

ప్రభుదేవాతో..

శింబుతో విడిపోయిన తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వీరు చివరి నిమిషయంలో విడిపోయారు. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది నయనతార.

ప్రస్తుతం సినిమాలు

ప్రస్తుతం సినిమాలు

నయనతార నటించిన ఇంకొక్కడు మూవ ఇటీవలే రిలీజైంది. ప్రస్తుతం ఆమె కార్తితో కాష్మోరా, డోర అనే హారర్ ఫిల్మ్ చేస్తోంది.

English summary
With Nayanthara and Vignesh Shivan appearing together in public, it seems the duo are set to confirm their relationship. Recently, on Thiruvonam day, Vignesh uploaded a selfie of them together as his display picture on his official Twitter page. The photograph has once again raised eyebrows and in no time it went viral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu