నాగార్జున కోసం డేట్స్ లేవని చెప్పిన నయనతార?
అక్కినేని స్టార్ నాగార్జున త్వరలో 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నారు. 'బంగార్రాజు' పేరుతో రూపొందబోయే ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రంలో నయనతార అయితే తనకు తగిన జోడీగా ఉంటుందని నాగ్ భావిస్తున్నాడట.
ఇదే విషయమై చిత్ర బృందం నయనతారను సంప్రదించగా చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది. తన డేట్స్ ఖాళీ లేవని, ఇప్పుడు నాగార్జున మూవీ చేయలేనని చెప్పేసిందట. నయనతార ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రజనీకాంత్ మూవీ 'దర్బార్' చిత్రానికి కూడా కమిటైంది.

ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు ఒక తమిళ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. దీంతో నాగార్జున సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేని స్థితిలో నయనతార ఉన్నట్లు సమాచారం. దీంతో చేసేది లేక 'బంగార్రాజు' టీమ్ వెనుదిరిగినట్లు తెలుస్తోంది.
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా, మోస్ట్ డిమాండ్ ఉన్న నటిగా నయనతార తన హవాకొనసాగిస్తున్నారు. సీనియర్ హీరోలకు కూడా సెట్టయ్యే ఏజ్, పర్సనాలిటీ, సెక్సీనెస్ ఆమె సొంతం కావడంతో చాలా మంది సీనియర్ స్టార్లు ఆమె డేట్స్ కూడా ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











