»   » హీరోయిన్ నయనతార గర్భవతి కాదట!

హీరోయిన్ నయనతార గర్భవతి కాదట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ మూవీ 'కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న 'అనామిక' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు/తమిళంలో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఆమె 'అనామిక' పాత్రలో కనిపించనుంది.

ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు. సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి‌తో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

అయితే ఈచిత్రంలో నయనతార గర్భవతిగా కనిపించదని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకే శేఖర్ కమ్ముల ఈ మార్పు చేసినట్లు సమాచారం. సినిమాలోని కొన్ని సీన్లలో నయనతారను దర్శకుడు గ్లామరస్‌గా చూపించాడని సమాచారం. కాగా....బాలీవుడ్ వెర్షన్ 'కహానీ'కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా, విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది.

English summary
We had already reported that Nayanthara is acting in the remake of Bollywood film ‘Kahaani’. The movie is being simultaneously made as a bilingual in Tamil and Telugu. The movie is titled as ‘Anamika’ and it is directed by Sekhar Kammula.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu