»   » పవన్ ఉన్నాడన్నా నో చెప్పేసింది

పవన్ ఉన్నాడన్నా నో చెప్పేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కల్యాణ్ ఉన్న సినిమాకు ఎక్సపోజరే వేరు. అందుకే ఆయన సినిమాల్లో చిన్న పాత్ర అయినా చేయటానికైనా అందరూ ఉత్సాహం చూపిస్తూంటారు. అయితే నయనతార మాత్రం నో చెప్పేసిందని సమాచారం. పవన్ తో మొదలు కానున్న ఓ మైగాడ్ రీమేక్ కు ఆమెను అడిగితే ఆమె మొహమాటం లేకుండా వీలు కాదని చెప్పిందని సమాచారం. తన పాత్రకు ప్రత్యేకమైన ఐడింటిటీ లేనప్పుడు తను ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏముందని దర్శక,నిర్మాతలను అడిగినట్లు తెలుస్తోంది. అంతేగాక పాత్ర చిన్నది కావటంతో రెమ్యునేషన్ విషయంలోనూ తగ్గించి ఇస్తాననటం కూడా ఆమె నో చెప్పటానికి ఓ కారణం అంటున్నారు.

వాస్తవానికి వెంకటేశ్-మారుతి కాంబినేషన్‌లో మొదలు కావాల్సిన 'రాధ' చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ రకరకాల కారణాలతో 'రాధ' సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో నయనతార డేట్స్‌ని నిర్మాత డీవీవీ దానయ్య వేరే నిర్మాతకి ఎడ్జెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసారు. అయితే అది బెడిసికొట్టిందని సినీ వర్గాల సమాచారం.

అయితే ఓ మైగాడ్ లో హీరోయిన్ కి అంత ప్రాధాన్యత ఉండేటంత సీన్ లేదు. కానీ దర్శకుడు దాని నిడివి పెంచి తెలుగుకి అణుగుణంగా తయారు చేసాడంటున్నారు. కిషోర్‌కుమార్(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే.

Nayanthara out of Oh My God remake?

బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. అయితే పవన్ స్వయంగా పార్టీ పెట్టి ప్రచారంకి వెళ్తూన్న నేఫధ్యంలో ఈ చిత్రం ఉంటుందా..ఉండదా..వేరే హీరో వచ్చి పవన్ ప్లేస్ ని రీ ప్లేస్ చేస్తాడా అనే ఊహాగానాలు అంతటా వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్ పై పవన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. మే నెల రెండో వారం నుంచీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. అప్పటికి ఎలక్షన్స్ ముగియనుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
latest buzz is that Nayanthara is no longer in talks for Telugu remake of Oh My God film. Nayanthara had only a small role in the film; however, she wasn’t willing to compromise on her remuneration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu