»   » షాకింగ్ గాసిప్: నయనతారకు ఆల్రెడీ పెళ్లయిందా?

షాకింగ్ గాసిప్: నయనతారకు ఆల్రెడీ పెళ్లయిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ బ్యూటీ నయనతార ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్నా... తర్వాత తనకంటూ ఓ తోడు వెతుక్కుందని, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోందని తమిళ మీడియాలో చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం నయనతార అతనితో సహజీవనం కూడా చేస్తోందని టాక్.

అయితే... తాజాగా తమిళ మీడియాలో మరో న్యూస్ హాట్ టాపిక్ అయింది. నయనతార, విఘ్నేష్ శివన్ ఆరు నెలల క్రితమే రహస్యంగా వివాహం చేసుకున్నారట. మే నెలలోనే వీరి వివాహం జరిగిందని, గతంలో ప్రేమ, పెళ్లి అంశాల్లో నయనతార చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్న నేపథ్యంలో.... మీడియాకు ఛాన్స్ ఇవ్వకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అంటున్నారు.

పెళ్లయిన దగ్గర నుండి ఇద్దరూ కలిసే ఉంటున్నారని, దర్శకుడిగా విఘ్నేష్ శివన్ ఎదిగేందుకు, స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చేలా నయనతార తనవంతు సహకారం అందిస్తోందని టాక్. ప్రస్తుతం నయనతార స్టార్ హీరోయిన్ వరుస అవకాశాలతో దూసుకెలుతున్న తరుణంలో..... కెరీర్ పరంగా ఎలాంటి ప్రభావం పడకూడదనే పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచారని టాక్.

ఓనమ్ పండగ

ఓనమ్ పండగ

కేరళకు చెందిన నయనతార ఇటీవల ఓనం పండుగను కూడా విఘ్నేష్ శివన్ తనే కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఓనం పండగ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను కూడా పోస్టు చేసారు. పెళ్లయింది కాబట్టే నయనతార ధైర్యంగా అతనితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిందని చర్చించుకుంటున్నారు.

కుటుంబంతో కలిసే..

కుటుంబంతో కలిసే..

నయనతారకు కుటుంబ సభ్యుల నుండి కూడా పూర్తి సహకారం ఉందని, పెళ్లి, సహజీవనం విషయంలో వారి నుండి ఎలాంటి అభ్యంతరా లేవని అంటున్నారు.

వాళ్ల దృష్టిలో లోకులు కాకులు

వాళ్ల దృష్టిలో లోకులు కాకులు

నయనతార, విఘ్నేష్ శివన్ దృష్టిలో లోకులు కాకులు. అందుకే వాళ్లేమన్నా పట్టించుకోడం లేదు. తమనకు నచ్చినట్లుగా ఉంటున్నారు. అందుకే బయట వీరిపై ఎలాంటి ప్రచారం జరుగుతున్నా ఉలుకు పలుకు లేదు.

త్వరలో అఫీషియల్‌గా

త్వరలో అఫీషియల్‌గా

రహస్యంగా పెళ్లి చేసుకున్న వీరు....కొంత కాలం పాటు మీడియా, జనం దృష్టిలో సహజీవనం చేస్తున్నట్లుగా చలామణి అవుతారు. సమయం చూసి అఫీషియల్ గా తమ పెళ్లి విషయాన్ని బయట పెడతారు.

గతంలో శింబుతో

గతంలో శింబుతో

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలతో ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో శింబుతో నయనతార లవ్వాయణం, ఇద్దరి చాటు మాటు రొమాన్స్ ఫోటోస్ లీక్ అవ్వడం అప్పట్లో ఓ సెన్సేషన్.

ప్రభుదేవాతో..

ప్రభుదేవాతో..

శింబుతో విడిపోయిన తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వీరు చివరి నిమిషయంలో విడిపోయారు. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది నయనతార.

ప్రస్తుతం సినిమాలు

ప్రస్తుతం సినిమాలు

నయనతార నటించిన కాష్మోరా మూవీ ఇటీవలే రిలీజైంది. ప్రస్తుతం డోర అనే హారర్ ఫిల్మ్ తో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తోంది.

English summary
Tamil film source said that, Nayanthara Secretly Married Director Vignesh Shivan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu