»   » ప్చ్...రీమేక్ చేసి పాడు చేస్తున్నారు

ప్చ్...రీమేక్ చేసి పాడు చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nee Jathaga Nenundali trailer not impressed
హైదరాబాద్ : హిందీలో సూపర్ హిట్ 'ఆషికి2' చిత్రాన్ని తెలుగులో 'నీ జతగా నేనుండాలి' పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సచిన్‌ హీరో, సంజయ్‌దత్‌ మేనకోడలు నజియా హీరోయిన్. జయ రవీంద్ర దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత. రీసెంట్ గా ఫస్ట్ ట్రైలర్ ని ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ చూసినవారు...రీమేక్ చేయకుండా ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. దీని కన్నా ఒరిజనల్ చాలా బాగుందని, రీమేక్ చేసి పాడు చేస్తున్నారని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఓ రేంజిలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ట్రైలర్ చూసి సినిమాని అంచనా వెయ్యలేమన్నది నిజం. ఏమో సినిమా బాగుంటుందేమో కొద్ది రోజులు ఆగితే సరిపోతుంది కదా.

ఇక ఈ చిత్రం కోసం ఇటీవల హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో 500 మంది డ్యాన్సర్లు పాల్గొనగా 'వింటున్నావా నేస్తం' అనే పాటని చిత్రీకరించారు. చంద్రబోస్‌ రాసిన గీతమది. బండ్ల గణేష్‌ మాట్లాడుతూ.. ''ఎవడు'చిత్రంలోని పాట పల్లవిని ఈ సినిమా పేరుగా నిర్ణయించాం. ఇది కథకి సరిపోయే పేరు. త్వరలోనే పోలండ్‌లో కూడా చిత్రీకరణ జరుపుతాం. వచ్చే వారంలో పాటలను, వచ్చే నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాము''అన్నారు.

ఇక దర్శకుడు జయ రవింద్ర గతంలో బంపర్ ఆఫర్(సాయిరామ్ శంకర్)తో చేసి హిట్ కొట్టారు. అలాగే అదే సాయిరామ్ శంకర్ తో చేసిన దిల్లున్నోడు చిత్రం రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ అయ్యింది. వికింగ్‌ మీడియా, బండ్ల గణేష్‌ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మిస్తున్నారు. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అంతటా వినిపిస్తోంది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే...ఓ క్యాషియర్ గా వ్యవరిస్తున్నాడని అంటున్నారు.

చిత్రం కథేమిటంటే...- రాహుల్ జయకర్ (ఆదిత్య రాయ్ కపూర్) పాప్ సింగర్. అతనికి అశేష అభిమానులు. అతడు ఆడింది ఆట పాడింది పాట. కానీ ఒక్కటే లోపం. తాగుడుకు బానిస. గోవా టూర్‌లో ఉండగా- అర్ధరాత్రి 'బార్'లన్నీ మూసేయటంతో.. ఊరి చివరి బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడ తన పాటని అంతకంటె మృదు మధురంగా ఆలపించిన ఆరోహి షిక్రె (శ్రద్ధా కపూర్) టాలెంట్‌కి ముగ్ధుడవుతాడు. తనతోపాటు ముంబై వస్తే సింగర్‌ని చేస్తానంటాడు. అతని మాటలు నమ్మి ముంబై చేరుకుంటుంది ఆరోహి. అనుకోని పరిస్థితుల్లో రాహుల్ ఆస్పత్రి పాలవుతాడు. ఆరోహి చేసే ఫోన్లన్నీ రాహుల్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకొని -రాహుల్ లండన్ వెళ్లాడని చెప్తాడు. దీంతో రాహుల్‌ని అపార్థం చేసుకుంటుంది ఆరోహి. రెండు నెలల తర్వాత రాహుల్ అసలు విషయం తెలుసుకొని ఆరోహి ఉన్న చోటికి వస్తాడు. అతడికి తెలిసిన మ్యూజిక్ కంపెనీలో ఆమెకి అవకాశం ఇప్పిస్తాడు. ఆమెలోని టాలెంట్ లోకానికి తెలుస్తుంది.

ఇటు సినిమాల్లోనూ అటు ప్రైవేట్ ఆల్బమ్‌లతోనూ బిజీగా మారిపోతుంది. అనుక్షణం ఆమెని అంటిపెట్టుకొని ఉంటూ సలహాలు సూచనలూ చెబుతూ ఆమెలో ధైర్యాన్ని నింపే రాహుల్ రోజుల తరబడి తాగటంవల్ల అతడి గొంతు దెబ్బ తింటుంది. కనీసం లోబడ్జెట్ సినిమాలకైనా పాడదామనుకుంటే అక్కడా ఎదురుదెబ్బ తగులుతుంది. రాన్రాను రాహుల్ పతనమవటం చూసిన ఆరోహి అతణ్ణి మళ్లీ మామూలు మనిషిగా.. గాయకుడిగా తీర్చిదిద్దాలనుకుంటుంది. దాంతో అతడి ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోతారిద్దరూ. కానీ - గతంలో చేసిన అగ్రిమెంట్స్ కారణంగా మళ్లీ కెరీర్‌ని ఆరంభించాల్సి వస్తుంది ఆరోహి. తన వల్లనే ఆమె కెరీర్ నాశనమై పోతోందనీ.. తను లేకుంటే ఆరోహి జీవితం బాగుంటుందని తలచి ఆత్మహత్య చేసుకొంటాడు రాహుల్. ఆ తర్వాత ఆరోహి జీవితం ఏమైందన్నది క్లైమాక్స్.

ఆషికి-2కు మరో రికార్డు ఉంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఏ రేంజిలో పట్టం కట్టారంటే... క్రితం సంవత్సరం ఎక్కువ మంది వెతికిన భారతీయ సినిమాల లో ఈ సినిమా చోటు చేసుకుంది. 'ఆషికి-2' బాలీవుడ్ చిత్రాన్ని లక్షలాది మంది గూగుల్ సర్చ్‌లో గాలించారట. ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలోని 'అప్ నే కరమ్ కీ కర్ అదాయే' అనే మొదటి పాటను యూట్యూబ్‌లో ప్రతి రోజు అనేక మంది వీక్షించారు.

English summary
The makers of the Telugu remake of Aashiqui 2 have released the first trailer of the film. Titled Nee Jathaga Nenundali, the romantic film stars Sachiin Joshi and Sanjay Dutt’s niece Nazia Hussain in the lead roles. It is not mighty impressed. We wish the makers came up with something better and original.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu