సురేష్ బాబు మనస్సులో పెట్టుకునే కామెంట్స్

సురేష్ బాబు, వెంచర్ కాపిటిలిస్ట్ శ్రీని రాజు కలిసి...ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు బోర్డర్ లో తడ, శ్రీ సిటీ సెజ్ వద్ద ఓ ఫిల్మ్ స్టూడియో నిర్మాణం మొదలపెట్టనున్నారని సమాచారం. తెలుగు,తమిళ చిత్రపరిశ్రమలను కలిసి వచ్చేలా ఈ స్టూడియోని నిర్మాణం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు పనులు ఇప్పటికే మొదలయ్యాయని అంటున్నారు. పులికాట్ సరస్సు, బీచ్ వంటి ఇప్పటివరకూ చూడని లొకేషన్స్ తో ఈ స్టూడియో తరపునుంచి ఆఫర్ చేస్తారని తెలుస్తోంది. రాబోయే రెండు సంవత్సరాలలో రెడీ అయిపోతుందని అంటున్నారు. పరిశ్రమ ఇప్పుడు ఉన్న పరిస్దితి గురించి ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్ారు.
సురేష్ బాబు మాట్లాడుతూ... పరిశ్రమలో ఏం జరిగినా.. 'ఆ నాలుగు కుటుంబాలు' అంటుంటారు. మేమేమీ పరిశ్రమలో అన్యాయంగా డబ్బులు సంపాదించుకోలేదు. ఎక్కడో డబ్బులు తీసుకొని స్టూడియోలు కట్టుకోలేదు. మా పెద్దలు సినిమాలు తీసి సంపాదించిన డబ్బుతో స్టూడియోలు, పంపిణీ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాం. థియేటర్ల సమస్య దేశవ్యాప్తంగా ఉంది. పెద్ద కంపెనీలు థియేటర్లను లీజుకు తీసుకొంటున్నాయి. ఆయా థియేటర్ల యాజమాన్యాలు కూడా అందుకు అంగీకరిస్తున్నాయి. దీంతో ఆ యాజమాన్యానికి నచ్చిన, డబ్బులొస్తాయనుకునే సినిమానే ఆడిస్తారు అన్నారు.
అలాగే ఛాంబర్ కూడా అక్కడ ఏర్పడాలి కదా అనొచ్చు. చెన్నై నుంచి వచ్చి చిత్రీకరణలు ప్రారంభించినప్పుడు ఇక్కడ ఛాంబర్ లేదు. ఛాంబర్ అనేది కేవలం ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్య వారధి మాత్రమే. ప్రధాన కేంద్రంలో ఛాంబర్ ఉంచి.. మనకు అనువైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరపొచ్చు. అది ఆదిలాబాద్ కావొచ్చు.. రాజమండ్రి కావొచ్చు.


Click it and Unblock the Notifications











