»   » ఆలోచించి,నీహారిక నెక్ట్స్ కు అదే బెస్ట్ అనుకుంది

ఆలోచించి,నీహారిక నెక్ట్స్ కు అదే బెస్ట్ అనుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె ..నీహారిక కొణిదల పెద్ద తెర ఎంట్రీ రీసెంట్ గానే జరిగిన సంగతి తెలిసిందే. రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన ఒక మనసు చిత్రంతో ఆమె వెండితెరకెక్కింది. అయితే ఆ సినిమా ఊహించిన మేరకు కిక్ ఇవ్వలేకపోయింది. మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా చెప్పబడుతున్న ఆ చిత్రం మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ని మూట కట్టుకుంది.

దానికి తోడు ఆమెలోని ఉషారుని అంతా చంపేసే పాత్రలో దర్శకుడు బాగా డల్ గా చూపించాడు. చీర కట్టించి మరీ ఆమెను ఓ మెచ్యూర్డ్ లేడీగా కనిపించేలా చేసాడు. దాంతో ఆమెకు రావాల్సిన మైలేజీ రాలేదు. ఎంతో ఆసపెట్టుకుని వెళ్లిన మెగాభిమానులు నిరాశపడిపోయారు. ఈ నేపధ్యంలో ఆమె తన రెండో చిత్రం అయినా ఆచి,తూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Niharika again in Web Series

ఈ సారి గ్లామర్ రోల్ కాకపోయినా ఆకర్షియంగా ఉంటే నటనకు ప్రయారిటీ ఇచ్చే పాత్రతో కనిపించాలని నిర్ణయించుకుందని సమాచారం. ఈ మేరకు ఆమె కథలు వింటోందని సమాచారం. అయితే ఈలోగా.. మ‌రో మూవీలో న‌టించే ముందు బుల్లి తెర‌పై ద‌ర్శ‌న‌మివ్వాల‌ని నిహారిక నిర్ణ‌యించుకుంది

నిహారికకు ఎంతో పేరు తీసుకొచ్చిన ముద్ద‌ప‌ప్పు అవ‌కాయ్ లో న‌టించేందుకు ఓటు వేసిందనిసమాచారం.. ఈ వెబ్ సీరియ‌ల్ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స్క్రిప్ట్ రూపొందించే ప‌నిలో ప‌డ్డాడు.. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుందని తెలుస్తోంది.

English summary
Niharika got good response for ‘Muddapappu Avakai’ Web series Episodes. So she again want to act in that series.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu