»   » నిహారికకు బంపర్ ఆఫర్.. సైరా నరసింహా రెడ్డిలో ఛాన్స్?

నిహారికకు బంపర్ ఆఫర్.. సైరా నరసింహా రెడ్డిలో ఛాన్స్?

Subscribe to Filmibeat Telugu
'Mega' Girl To Play A Prominent Role In Sye Raa

ఒక మనసు చిత్రంతో కొణిదల వారి అమ్మాయి నిహారిక నటిగా మారింది. తొలి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా కూడా నిహారిక నటిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒక మనసు చిత్రం తరువాత నిహారిక ఆచి తూచి అడుగులు వేస్తోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకా తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోది. కెరీర్ ని ఇప్పుడిప్పుడే మలచుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నిహారికకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి చిత్రంతో నటించే అవకాశం నిహారికకు వచ్చినట్లు తెలుస్తోంది.

కొణిదల కుటుంబం నుంచి నటిగా

కొణిదల కుటుంబం నుంచి నటిగా

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి నటి నిహారిక. ఒక మనసు చిత్రంతో నిహారిక హీరోయిన్ గా మారింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ నటిగా నిహారికకు మంచి మార్కులు పడ్డాయి.

తెలుగు, తమిళ చిత్రాల్లో

తెలుగు, తమిళ చిత్రాల్లో

నిహారిక కేవలం తెలుగు చిత్రాలలోనే కాక తమిళ చిత్రాలలో సైతం నటించేందుకు ఆసక్తి చూపుతోంది. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే తెలుగులో సుమంత్ అశ్విన్ సరసన హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నటిస్తోంది.

పెదనాన్న చిత్రంలో బంపర్ ఆఫర్

పెదనాన్న చిత్రంలో బంపర్ ఆఫర్

నిహారిక తాజాగా ఓ బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు నిహారికకు అవకాశం వచ్చిందనేది ఈ వార్తల సారాంశం.

కెరీర్ కు పెద్ద బూస్ట్

కెరీర్ కు పెద్ద బూస్ట్

సైరా చిత్రంలో నటించే అవకాశం రావడం నిహారిక కెరీర్ కు పెద్ద బూస్ట్ అని అంటున్నారు. నిహారిక ఈ చిత్రంలో ఎలాంటి రోల్ లో కనిపించబోతోంది అనే విషయంపై అధికారిక సమాచారం రావలసి ఉంది.

స్టార్స్ అంతా ఏకమై

స్టార్స్ అంతా ఏకమై

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చా సుదీప్ ప్రముఖ నటులు సైరా చిత్రంలో నటిస్తున్నారు. నిహారిక నటించడం ఖాయం అయితే సైరా చిత్రం గురించి మెగా అభిమానుల్లో మరింతగా చర్చ జరగడం ఖాయం.

వెనకడుగు వేయకుండా రాంచరణ్

వెనకడుగు వేయకుండా రాంచరణ్

అత్యుత్తమ చిత్రంగా సైరాని తీర్చి దిద్ది అభిమానులని రంజింపజేయాలని నిర్మాతగా వ్యవహరిస్తున్న రాంచరణ్ భావిస్తునాడు. సైరా చిత్రం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ విషయంలో రాంచరణ్ వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది.

English summary
Niharika will going to play key role in megastar's Sye Raa Narasimha Reddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X