»   »  నిఖిల్,మోనాలి ...'లవ్ డేస్' ?

నిఖిల్,మోనాలి ...'లవ్ డేస్' ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nikhil
'హ్యాపీడేస్' సినిమాతో ఒక్క సారిగా ఆ తారలు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీలు గా మారిపోయారు. మెయిన్ జంటగా నటించిన వరుణ్ సందేశ్, తమన్నాలకే గాకుండా మిగిలిన వాళ్లు కూడా అవకాశాలు పొందుతున్నారు. అంతేగాక సినిమాలో లాగానే ఒకరితో ఒకరితో ప్రేమలో కూడా పడ్డారట. అంతకాలం సోషల్ గా కలసి ఉండటం, వయస్సులో ఉన్న వారు కావటం, భావాలు కలవటం ఈ తరహా పరిస్థితిలకు దారి తీసిందిట. తాజాగా నిఖిల్,'హ్యాపీడేస్'లో సంగీతగా నటించిన మోనాలి కలిసి తిరుగుతు ప్రేమలో ఉన్నామని నిరూపిస్తున్నారట.

నిఖిల్ ప్రస్తుతం 'అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్' సినిమాలో అంకిత్‌గా హీరో పాత్రను చేస్తున్నాడు. మోనాలి ఇప్పుడు మాటీవీ సీరియల్ 'యువ'లో ఒక ప్రధాన పాత్రను చేస్తోంది. వాళ్ళిద్దరూ కలిసి తరచూ పబ్‌లలో దర్శనమిస్తున్నారని ఫిల్మ్‌నగర్ వార్త పరుగులు తీస్తోంది. అంతేగాక ఆ ఇద్దరూ ఒకరి సమక్షాన్ని మరొకరు బాగా ఇష్టపడుతున్నారనీ, చూస్తుంటే వారు ప్రేమలో పడినట్లే కనిపిస్తోందనీ అనుకుంటున్నారు. అది నిజమో, కాదో గాని చాలా మందికి కొద్ది రోజులు పాటు హ్యాపీగా చెప్పుకోవటానికి న్యూస్ దొరికినట్లే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X