»   » నిఖిల్ తో ముగ్గురు క్రేజీ హీరోయిన్స్..ఎవరెవరంటే

నిఖిల్ తో ముగ్గురు క్రేజీ హీరోయిన్స్..ఎవరెవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన నిఖిల్ తన తదుపరి చిత్రం షూటింగ్ త్వరలో మొదలెట్టబోతున్నారు. ఈ మేరకు కాస్టింగ్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. సందీప్ కిషన్ తో టైగర్ చిత్రం చేసిన విఐ ఆనంద్ తో ఈ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నిఖిల్ తో రొమాన్స్ చేయనున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఒక హీరోయిన్ గా తాప్సీ ని ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. అలాగే సెకండ్ హీరోయిన్ గా ఉయ్యాలా జంపాలా ఫేం అవిక గోర్ ని సెలక్ట్ అయ్యింది. ప్రస్తుతం మూడవ హీరోయిన్ గా కలర్స్ స్వాతిని అడుగుతున్నారని తెలుస్తోంది. నిఖిల్ తొలిసారిగా ముగ్గురు హీరయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ 2వ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Nikhil to romance with Taapsi in his next

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్ర నిర్మాత-మేఘన ఆర్ట్స్‌ అధినేత పి.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. "టైగర్" చిత్రంతో విజయం సాధించి, స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనాన్ని ఆవిష్కరించిన వి.ఐ.ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తనదైన శైలిలో సరికొత్త కధలని ఎంచుకునే హీరో నిఖిల్‌ ఈ కధని సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకె చేసారు. సాయిశ్రీరాం, అబ్బూరి రవి, శేఖర్‌చంద్ర, చోటా కే ప్రసాద్ వంటి సక్సెస్ ఫుల్ టేక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటుల ఎంపిక పూర్తి చేసి.. త్వరలోలో సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం " అన్నారు.


ఈ చిత్రానికి ఛీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌: విజయ్‌ కామిశెట్టి, కో-డైరెక్టర్‌: వరప్రసాద్‌ వరికూటి, ఆర్ట్‌: ఎ.రామాంజనేయులు, ఎడిటింగ్‌: చోటా.కె.ప్రసాద్‌, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: సాయిశ్రీరాం, సహ నిర్మాత: డి.శ్రీనివాస్‌, నిర్మాత: పి.వెంకటేశ్వర్రావు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌

English summary
Nikhil will be seen romancing three actresses in VI Anand film. Apparently, Taapsee and Avika Gor have been finalized as the female leads.
Please Wait while comments are loading...