»   »  నిఖిల్ కౌంటర్ కి ,నిర్మాతకి నోట మాట రాదు

నిఖిల్ కౌంటర్ కి ,నిర్మాతకి నోట మాట రాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వామిరారా చిత్రానికి సీక్వెల్ వస్తుందని వార్త వచ్చి ఎంతో సేపు కాలేదు. అప్పుడే ఆ సినిమా ఉండచ్చు,ఉండకపోవచ్చు, చేయచ్చు,చేయకపోవచ్చు అనే విధంగా నిఖిల్ ట్వీట్ చేసి, ఆ వార్తకు కౌంటర్ ఇచ్చేసాడు. నిఖిల్ ని సంప్రదించి ఆ ప్రెస్ నోట్ ఇవ్వలేదా, లేక నిర్మాత కంగారుపడి ప్రాజెక్టు ఫైనలైజ్ కాకుండానే మీడియాకు విషయం ఇచ్చేసాడనే ఇలా నిఖిల్ అన్నాడా అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చగా మారింది. ఏదైమైనా నిఖిల్ ఇచ్చిన ట్వీట్ కు నిర్మాతకు కంగారుపుట్టి ఉంటుందంటున్నారు.

నిఖిల్ సోలో హీరోగా అందుకున్న బిగ్గెస్ట్ హిట్ 'స్వామి రారా'. ఈ సినిమాకి సీక్వెల్ తీయనున్నామని నిన్ననే ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అనౌన్స్ చేసారు. ఇంతలోనే ఈవిషయమై నిఖిల్ ట్వీట్ ఇచ్చారు. ఆ ట్వీట్ లో ఏముందీ అంటే.... ' స్వామి రారా చిత్రం సీక్వెల్ మ్యాటర్ ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. నేను కూడా ఈ చిత్రం ప్రొడక్షన్ టీంలో ఒక్కడిని. ఈ సినిమా మొదలవ్వచ్చు లేదా మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఒక ఐడియా మీద మాత్రం వర్క్ చేస్తున్నాం. స్వామి రారా కంటే స్క్రిప్ట్ బాగా వస్తేనే స్వామి రారా సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుంది' నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

Nikil tweet about his Swamy Ra Ra Seqeul

ఎన్.బోస్... స్వామి రారా దర్శకుడు వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవంతో ఈ చిత్రం రూపొందించటానికి సిద్దపడుతున్నారు. స్వామి స్వామి రారా అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది సాగా కంటిన్యూస్ అనేది ఉపశీర్షిక. ఎన్.బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని స్వామిరారా చిత్రాన్ని నిర్మించిన చక్రి చిగురుపాటి లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించబోతున్నాడు.

నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ... నవ్యతతో కూడిన కథాంశంతో సినిమాలు రూపొందిస్తే ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ తప్పక వుంటుందని స్వామిరారా చిత్రం మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించబోతున్నాం. ఓ స్టార్ హీరో నటించనున్న ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, హై బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించనున్నాం. త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బీఎస్ వర్మ.

English summary
Nikil Tweeted: “Swamy Ra Ra sequel is still in the discussion stage guys… i am part of the production house and i can tell u it might or might not happen..Ideas are being discussed and if it is made, we want swamy rara 2 script to be as good or better than the 1st :-) let’s see, fingers crossed”,
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu