Just In
Don't Miss!
- News
Tractor rally: ట్రాక్టర్ల నెంబర్లు రాసుకున్న పోలీసులు, అమ్రేష్ పురి టైపులో ఓం భ్రీమ్ బ్రుష్!
- Sports
సైనీ గాయం గురించి మర్చిపోయా.. మూడో పరుగు కోసం రమ్మన్నాను! అంతలోనే: పంత్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'పవన్ కళ్యాణ్'కి బాకీ పడ్డ నితిన్.. ఆ రుణం తీర్చుకోవడానికి న్యూ ప్లాన్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అభిమాని అంటే మొదట గుర్తుకు వచ్చే లిస్ట్ లో నితిన్ ఉంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ మొదటి నుంచి నితిన్ పవర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్ అని అందరికి తెలిసిన విషయమే. తనకంటూ ఒక మార్కెట్, స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత కూడా నితిన్ ఏ మాత్రం తగ్గకుండా ఒక సాధారణ అభిమానిలా తన ప్రేమను చాటుకుంటాడు.

పవన్ కళ్యాణ్ ఉండాల్సిందే..
తన ప్రతి సినిమాలో ఈ స్టార్ హీరో ఎదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటాడు. దాదాపు పవర్ స్టార్ అభిమానులంతా నితిన్ వైపే ఉంటారు. సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ లలో పవర్ స్టార్ నితిన్ బ్యానర్స్ తో అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. నితిన్ కెరీర్ కి పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఓ విధంగా బాగానే ఉపయోగపడింది.

సక్సెస్ ట్రాక్..
నితిన్ తన కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మొన్నటి వరకు కాస్త వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమైన నితిన్ మొత్తానికి భీష్మ సినిమాతో సెట్టయ్యాడు. సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో మళ్ళీ తప్పటడుగులు వేయకుండా ప్రయోగాలకు దూరంగా ఉంటున్నాడు. తన మార్కెట్ ని ఇంకా పెంచుకోవాలని మినిమామ్ బాక్సాఫీస్ హిట్స్ కోసమే నితిన్ కష్టపడుతున్నాడు.

బాకీ పడ్డ నితిన్..
నితిన్ తన అభిమాన హీరోకు బాకీ పడ్డాడు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో నితిన్ ఛల్ మోహన్ రంగ అనే సినిమా చేసి ప్లాప్ అందుకున్నాడు. నితిన్ హోమ్ బ్యానర్ తో పాటు త్రివిక్రమ్ కూడా ఆ సినిమాకు సహా నిర్మాతలుగా ఉన్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా 2018లో విడుదలైంది. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఓ విదంగా పవన్ కళ్యాణ్ కి కూడా ఆ సినిమా నష్టాన్ని కలిగించింది.

రుణం తీర్చుకోవడానికి న్యూ ప్లాన్..
పవన్ కళ్యాణ్ తన సినిమా ద్వారా నష్టపోవడం నితిన్ కాస్త ఇబ్బందిగానే ఫీల్ అయ్యాడు. నమ్మకంతో మరో మంచి సినిమాను మళ్ళీ ఆయన ప్రొడక్షన్ లోనే చేయాలని అనుకుంటున్నాడు. కానీ పవన్ ఇప్పుడు సినిమాలు నిర్మించేంత సాహసం చేయలేడు. అందుకే కేవలం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రొడక్షన్ ట్యాగ్ ని సినిమాకు వాడుకోవాలని నితిన్ ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం రెండు నమ్మకమైన రీమేక్ కథలపై చర్చలు జరుపుతున్న నితిన్ ఆ రెండు సినిమాల్లో ఎదో ఒక దాన్ని పవన్ బ్యానర్ లో చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే పవన్ ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా సహా నిర్మాతగా బ్యానర్ ని సినిమాకు తగిలిస్తే చాలాట. దీంతో లాభాల్లో షేర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ డీల్ కు పవన్ ఎంతవరకు అంగీకరిస్తాడో చూడాలి.