Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్ తో కాదు, నితిన్ తో హను...మార్పు వెనక ఏం జరిగింది?
హైదరాబాద్: అఖిల్ అక్కినేని తో అనుకున్న సినిమా ఇప్పుడు నితిన్ వద్దకు చేరింది. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో చిత్రం దాదాపు సెట్ అయినట్లే. ఇది అఖిల్ అభిమానులకు ఊహించని షాకే. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ...అఖిల్ స్వయంగా తాను హను దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. అంతలోనే ఈ ట్విస్ట్.
వివరాల్లోకి వెళితే..'అందాల రాక్షసి' ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని రెండో సినిమా తెరకెక్కనుందనే వార్తలొచ్చాయి. ఈ వార్తని అఖిల్ కూడా ధృవీకరించారు. దీంతో.. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందనుకొన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం అఖిల్ రెండో సినిమా ఆగిపోయింది. నిర్మాత దొరకకపోవడమే కారణమని చెబుతున్నారు. కానీ.. అసలు నిజం వేరే ఉంది అంటున్నారు.
అంతేకాకుండా ఇదే విషయమై ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడిదే కథతో నితిన్ హీరోగా సినిమాని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు హను రాఘవపూడి. అఖిల్ సినిమా ఆగిపోగానే.. హను నితిన్ దగ్గరికి వెళ్లి కథ వినిపించడం.. నితిన్ ఓకే అనేయడం చకచకా జరిగిపోయాయట. 14 రీల్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్క అవకాశాలున్నాయి.
అఖిల్ అక్కినేని తొలి చిత్రం 'అఖిల్' నిర్మాతగా వ్యవహారించాడు నితిన్. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అప్పటినుంచి అఖిల్ రెండో సినిమా కోసం కథలు వింటూ కాలక్షేపం చేస్తున్నాడు. రీసెంట్ గా నేను కథలు వినటం పూర్తైంది, హనుతో సినిమా చేస్తున్నా అన్నాడు. అయితే ఆ సినిమాని నితిన్ ఎగరేసుకుపోయాడు. అఖిల్, నితిన్ బంధం చాలా డిఫరెంట్ నే మరీ..అంటున్నారు సినిమాజనం.
స్లైడ్ షోలో అఖిల్ తో ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోవటానికి కారణం...

ఎగ్రిమెంట్ సమస్య
కృష్ణగాడి వీరప్రేమ గాధ ని నిర్మించిన నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు...దర్శకుడు హనుతో రెండో సినిమా ఎగ్రిమెంట్ చేసుకోవటమే కారణం.

అబ్జెక్షన్
దాంతో వారు అఖిల్ తో చేసినా మరో హీరోతో హను చేసినా తమ బ్యానర్ లోనే చెయ్యాలని పట్టుబట్టారు.

ఒప్పుకోలేదు
వేరే ప్రొడక్షన్ హౌస్ తో అఖిల్ తో ఎగ్రిమెంట్ ఉంది. అఖిల్ ఖచ్చితంగా ఆ బ్యానర్ లో తన రెండో చిత్రం చేయాలి. వాళ్లూ ఒప్పుకోలేదు.

నాగ్ కూడా..
నాగార్జున ఈ సమస్యను ఇరు పక్షాలతో మాట్లాడి సమీక్షించి, సరిచేద్దామనుకున్నారు కానీ, సెట్ కాలేదు.

అఖిల్ సైతం
ఈ విషయంలో అఖిల్ సైతం ఏమీ చెయ్యలేని పరిస్దితుల్లో హను తో మరో సినిమా చేద్దాం అని బై చెప్పాడట

నితిన్
హనుకు రెండో సినిమా ఎగ్రిమెంట్ ప్రకారం నితిన్ హీరోగా అదే కథని 14 రీల్స్ లో చేస్తున్నాడట

ఇప్పుడు అఖిల్
ఈ ప్రాజెక్టు సైతం ముందుకు వెళ్లకపోవటంతో అఖిల్ మళ్లీ కథలు వినటం మొదలెట్టాడట

విక్రమ్ కుమార్ తో
తనకు మనం వంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆ దర్శకుడుతో చర్చలు జరుపుతున్నాడట

రీమేక్ వద్దు
తనకు రెండో సినిమాగా రీమేక్ చేయాలనే ఆలోచన లేదని , తండ్రి నాగ్ కు చెప్పి స్ట్రైయిట్ కథ కోసం వెయిట్ చేస్తున్నాడట

త్రివిక్రమ్ తో
అఖిల్ మాత్రం డైరక్ట్ గా త్రివిక్రమ్ తో రెండో చిత్రం చేయాలని ఉందిట. కానీ త్రివిక్రమ్ తన కమిట్మెంట్స్ తో కష్టం అని చెప్పాడట