Don't Miss!
- Finance
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో బంగారం ధరలిలా!!
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఆ సినిమా పక్కన పెట్టిన నితిన్.. మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?
చివరిగా భీష్మ సినిమాతో హిట్ కొట్టిన నితిన్ ఆ తర్వాత మరో సినిమా హిట్ కొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన రెండు సినిమాలు భారీగా నిరాశ పరిచాయి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేయగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా రంగ్ దే కూడా నితిన్ కి కలిసి రాలేదు. తొలుత ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చినా సరే ఆ తర్వాత నెమ్మదిగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. దీంతో ఆయన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు అని అంటున్నారు.
ప్రస్తుతం ఆయన హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అందాధున్ సినిమా రీమేక్ మాస్ట్రోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పటికే ఆయన ఈ సినిమా కాకుండా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఆయన పవర్ పేట అనే సినిమా చేయాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సినిమా ప్లేస్ లో నితిన్ తన తదుపరి సినిమా వక్కంతం వంశీ తో చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీలైనంత త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

నిజానికి కొద్ది రోజుల క్రితం నితిన్ మహీ వీ రాఘవతో సినిమా చేయాలనే ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. చివరిగా యాత్ర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రాఘవ ఆ తర్వాత ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో మహి వీ రాఘవ నితిన్ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ వక్కంతం వంశీ నితిన్ ప్రాజెక్టు పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.. మరి చూడాల్సి ఉంది నితిన్ ఎవరితో సినిమా అనౌన్స్ చేస్తాడు అనేది.