ప్చ్... రామ్ చేతిలో ప్రాజెక్టు నితిన్ కి ఖరారు...

2013 చివరలో విడుదలై హిట్టైన చిత్రాల్లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఒకటి. చిన్న సినిమా అయినా పెద్ద విజయమే సాధించి పరిశ్రమలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధికి వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. దాజాగా ఆయన ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య తో చిత్రం చేయటానికి కమిటయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నితిన్ ..హీరోగా చెయ్యనున్నాడు.
ఇప్పుడు యూత్ అనుభవం లేకపోయినా తెరపై అద్భుతాల్ని సృష్టిస్తోంది. గతేడాది నవతరం దర్శకులు పలువురు మెగాఫోన్ చేతపట్టి విజయాలు అందుకొన్నారు. అందులో మేర్లపాక గాంధి ఒకరు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో ఇంటిల్లిపాదినీ అలరించారు. ఆ ప్రతిభను పరిశ్రమ కూడా గమనించింది. అందుకే ఇప్పుడు అవకాశాలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. గాంధి దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది.
నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ''ఇటీవలే కథా చర్చలు పూర్తయ్యాయి. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మంచి కథని సిద్ధం చేశారు గాంధి. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాం. వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న ఓ యంగ్ హీరో ఇందులో నటించబోతున్నాడు. ఆ వివరాల్ని మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తాము''అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: డి.పార్వతి.


Click it and Unblock the Notifications











