»   » 'అఖిల్' ఫ్లాపు రికవరీ కోసమే నితిన్ అలా? జనం గుసగుసలు

'అఖిల్' ఫ్లాపు రికవరీ కోసమే నితిన్ అలా? జనం గుసగుసలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నితిన్ నిర్మాతగా మారి నిర్మించిన అఖిల్ చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వలన చాలా నష్టపోయారు. అయితే ఇప్పుడు ఫామ్ లో ఉన్న నితిన్ ..ఆ చిత్రం వలన వచ్చిన నష్టాలను రికవరీ చేసేందుకు నడుం బిగించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

అందుకోసం నితిన్ ఎంచుకున్న రూటు...తన రెమ్యునేషన్ పెంచటమే అని అంటున్నారు. అందుతున్న సమాచారం బట్టి...అఆ సినిమా నితిన్ కెరియ‌ర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిల‌వ‌డంతో త‌న పారితోషికాన్ని అమాంతం పెంచేశాడ‌ని చెప్పుకుంటున్నారు. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌తో విష‌యం చెబుతున్నాడ‌ట‌. అఖిల్ సినిమా న‌ష్టాల‌ను అధిగ‌మించాల‌ని రికవరీ చేసే పనిలో నితిన్ పడ్డాడని చెప్పుకుంటున్నారు.

అయితే ఏ హీరో అయినా సక్సెస్ లో ఉన్నప్పుడు రెమ్యునేషన్ పెంచుతారు. లేకపోతే తొలి సినిమాకు ఏ రెమ్యునేషన్ తీసుకున్నారో అదే వందో సినిమాకు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు డిస్కౌంట్ లు సైతం ఇస్తూంటారు. మార్కెట్ ని బట్టి రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.

వాస్తవానికి అందులో వింతగాని తప్పుగానీ ఏమీ లేదు. నితిన్ వంటి ప్రామిసింగ్ స్టార్ ఓ రూపాయి రేటు పెంచినా నిర్మాతలు ఆనందంగా ఇస్తూంటారు. నితిన్ కూడా అర్దాంతరంగా పెంచే హీరో కాదు..ఎందుకంటే అతనూ నిర్మాతే, డిస్ట్రిబ్యూటరే, సినిమా కష్టనష్టాలు తెలుసున్న వ్యక్తే.

Nithin signs Bengal Tiger producer's movie

ఓ టైమ్ లో .. వ‌రుస ఫ్లాప్ ల‌తో త‌న కెరియ‌ర్ అయిపోయింది అనుకున్న స‌మ‌యంలో ఇష్క్ తో మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చాడు నితిన్. త‌రువాత తన వయస్సుకు తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథలను ఎంచుకుంటూ వ‌రుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు.

అ...ఆ చిత్రం సక్సెస్ తో నితిన్ మంచి ఊపు మీద ఉన్నారు. ఇదే ఊపులో ఆయన రెండు చిత్రాలు కమిటయ్యారు. అందులో ఒకటి తమ సోదరి నిర్మాతగా సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పై నిర్మితమవుతుంది. అలాగే తదుపరి చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన బెంగాళ్ టైగర్ చిత్రం నిర్మాత కే.కే రాధామోహన్ బ్యానర్ లో ఉండనుంది.

మొదట తమ సొంత బ్యానర్ పై చిత్రం చేస్తారు. ఆ తర్వాత రాధామోహన్ బ్యానర్ పై ఇమ్మీడియట్ గా చిత్రం చేయనున్నారు. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. రాధామోహన్ నిర్మించే చిత్రం భారీ ప్రొడక్షన్ విలువలతో , ఓ లీడింగ్ డైరక్టర్ డైరక్షన్ లో రూపొందనుంది. నితిన్ ప్రస్తుతం తన అ..ఆ చిత్రం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

English summary
It comes to know that Nitin is quite choosy in selecting the movies. Nithin immediate next film will be produced by his sister on their home banner Sresth Movies. On the other hand, he has signed another film which will be produced by K K Radhamohan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu