»   » నారా రోహిత్ తో ఎంట్రీ...నితన్ తో సెటిల్

నారా రోహిత్ తో ఎంట్రీ...నితన్ తో సెటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం త్రివిక్రమ్ తో చిత్రం చేస్తున్న నితిన్ తన తదుపరి చిత్రానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు పాటల రచయిత నుంచి దర్శకుడుగా మారిన కృష్ణ చైతన్య. ఇంతకు ముందు కృష్ణ చైతన్య...నారా రోహిత్ తో ‘రౌడీ ఫెలో' చిత్రం అందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు కానీ దర్శకుడుగా, మాటల రచయితగా మంచి పేరు తెచ్చి పెట్టింది. రీసెంట్ గా నితిన్ కు బౌండ్ స్క్రిప్టుతో కథ వినిపించాడని, నచ్చిన నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నితిన్, త్రివిక్రమ్ చిత్రం విశేషాలు...

నితిన్‌ హీరోగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తారు. హీరోయిన్ గా సమంతను ఎంచుకొన్నారు. నితిన్‌, సమంత కలసి నటించడం ఇదే తొలిసారి. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత.

నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌తో ఇది మా మూడో చిత్రం. ఇది వరకు తెరకెక్కించిన 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' మంచి విజయం సాధించాయి. నితిన్‌ చిత్రంతో హ్యాట్రిక్‌ కొడతాం. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు త్వరలో ప్రకటిస్తాము''అన్నారు. వచ్చే నెల మూడో వారంలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Nithin teams up with Krishna Chaitanya?

సమంత ప్రక్కన చేయాలని నితిన్ కు ఎప్పటినుంచో ఉందని అది ఈ చిత్రం తో తీరనుందని అంటున్నారు.అంటే త్రివిక్రమ్ కన్నా సమంతకే నితిన్ ప్రయారిటీ ఇచ్చారని అనుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ ఇంతకు ముందు అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో సమంత ని తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో వెంటనే సమంత ఓకే చేసి,డేట్స్ ఎలాట్ చేసిందని చెప్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రమణియన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: రాజీవన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి.డి.వి. ప్రసాద్‌, సమర్పణ: మమత, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్‌.

గతంలో...

ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో నితిన్ తో మరో సినిమా చేయనున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్, పూరి ఇద్దరూ కూడా ఖరారు చేసారు. మొన్ననే ఫైనల్ నేరేషన్ విన్నాను. సినిమా ఓ హార్ట్ టచ్చింగ్ పాయింట్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ..జూన్ 15 నుంచి షూటింగ్ అని నితిన్ ఆనందంగా కూడా ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

నితిన్ ట్వీట్ చేస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్ చేసారు.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

English summary
According to the latest, it is coming out that Nithin is getting ready to star under the direction of lyricist cum singer Krishna Chaitanya.
Please Wait while comments are loading...