'అలా మొదలైంది' హీరోయిన్ పై ఫ్లాప్ హీరో నితిన్ కన్ను
అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ తాజాగా నితిన్ చిత్రంలో బుక్కయింది. బాలీవుడ్ లో 13బి చిత్రంతో విజయం సాధించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందే ఇష్క్ చిత్రంలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే నితిన్ ఈమెను హీరోయిన్ గా తీసుకునే విషయంలో బాగా పట్టుపట్టి ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది. నిర్మాత,దర్శకులకు వేరే హీరోయిన్ డేట్స్ అందుబాటులో ఉన్నా నితిన్ పట్టుదలతో ఆమె అయితేనే చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా నితిన్...త్రిష, ఇలియానా, మమతా మోహన్ దాస్ ఇలా ఎవరు క్రేజ్ లో ఉంటే వారితోనే చేయటానికి ఇష్టపడేవాడు. ఇక ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ కెమెరా అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరవింద్ శంకర్ సంగీతం అందించనున్నారు. ఇది ఓ ఢిఫెరెంట్ లవ్ స్టోరీగా చెప్తున్నారు.
అలా మొదలైంది నిత్యా మీనన్ నాని నితిన్ ఇష్క్ 13బి మాధవన్ ala modalaindi nitya menon nani nitin ishq madhavan


Click it and Unblock the Notifications