»   »  'అ...ఆ' : లాస్ట్ మినిట్లో ఆ నిర్ణయం, ఎంతవరకూ ప్లస్ అవుతుంది?

'అ...ఆ' : లాస్ట్ మినిట్లో ఆ నిర్ణయం, ఎంతవరకూ ప్లస్ అవుతుంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ లో రూపొందిన ..'అ...ఆ' చిత్రం ఈ రోజు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ విషయం ఫిల్మ్ సర్క్లిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే... ఈ సినిమా రిలీజ్ కు ముందే 18 నిముషాలు ట్రిమ్ చేసారని. సినిమా పేస్ నిలబెట్టడానికి, ఎక్కడా డ్రాప్ అవకుండా టైట్ స్క్రీన్ ప్లే తో పరుగెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ అయ్యాక.. మార్నింగ్ షో కు లెంగ్త్ ఎక్కువైందని టాక్ రావటం , వెంటనే దర్శక,నిర్మాతలు మేలుకుని, కంగారు కంగారుగా ట్రిమ్ చేయటం కామన్ అయ్యిపోయింది. బ్రహ్మోత్సవం, ఊపిరి, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి పెద్ద చిత్రాలు, అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే చిత్రాలకు సైతం ఈ ట్రిమ్మింగ్ తప్పలేదు.

దాంతో రిలీజ్ అయ్యాక ఎందుకు, మనమే మరోసారి చెక్ చేసుకుందాం అని లాస్ట్ మినిట్ లో మరో సారి చూసుకుని సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, సమంత మీద వచ్చే కొన్ని సీన్స్ రిపీట్ అవుతాయని భావించినవి తొలిగించినట్లు సమాచారం.

Nitin's A..Aa: Last-Minute Trimming

ఈ ట్రిమ్మింగ్ తర్వాత చూస్తే అవుట్ పుట్ చాలా సూపర్ గా ఉందని, పూర్తి స్దాయిలో సంతృప్తి చెందాకే క్యూబ్, యుఎఫ్ ఓ లకు పంపారని తెలుస్తోంది. ఈ డెసిషన్ హీరో, నిర్మాత, దర్శకుడు ముగ్గరు అనుకుని చేసిందే అని చెప్తున్నారు.

ఈ ట్రిమ్మింగ్ తో కొద్దిపాటి టెన్షన్ తో ఉన్న టీమ్ మొత్తం రిలీఫ్ ఫీలయ్యారని,, అంతగా కాకపోతే ఏ రెండో వారమో లేదా మూడవ వారం నుంచో ఈ ట్రిమ్ చేసిన సీన్స్ ని కలుపుదామనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

English summary
The makers of A..Aa said to have trimmed the film by 18 minutes. In order to maintain the film's pace, the unit reportedly chopped few unwanted scenes from the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu