»   »  నితిన్ 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' : హాలీవుడ్ కాపీ? దర్శకుడు ఖండన

నితిన్ 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' : హాలీవుడ్ కాపీ? దర్శకుడు ఖండన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నితిన్‌ హీరోగా నటించిన చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'. యామీ గౌతమ్‌ హీరోయిన్. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ ఈ చిత్రానికి సమర్పకుడు. ప్రేమ్‌సాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గురు ఫిలింస్‌, మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. కార్తీక్‌, అనూప్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హాలీవుడ్ కాపీ అంటూ తమిళ సిని వర్గాల్లో ప్రచారం మొదలైంది. అదేమిటో ఇక్కడ చూద్దాం...

ఈ చిత్రం తాజా ట్రైలర్ చూసిన వారు... 2012లో వచ్చిన హాలీవుడ్ థ్రిల్లర్ "Premium Rush" కాపీ అంటున్నారు. రెండూ ఒకే రకమైన నేపధ్యం,కథతో ఉన్నాయంటున్నారు. అయితే "Premium Rush" అమెరికన్ భాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ అయ్యింది.


అయితే ఈ విషయమై దర్సకుడు ప్రేమ సాయి ఖండించారు. తాను 2011 లోనే ఈ కథను రాసుకుని రిజిస్టర్ చేసుకున్నానని అన్నారు."Premium Rush" చిత్రం 2012 లో వచ్చిందని చెప్పుకొచ్చారు. రిలీజ్ అయ్యాక కానీ నిజా నిజాలుతెలియదు.


తాజాగా ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ విడుదల చేసారు. ఆ ట్రైలర్ ఈ క్రింద చూడండి.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నితిన్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం గౌతమ్‌ మేనన్‌, ప్రేమ్‌సాయి చాలా కష్టపడ్డారు. నా దృష్టిలో ఈ సినిమాకి వాళ్లే హీరోలు. సన్నివేశాలు సహజంగా ఉంటాయి. భారతీయ వెండి తెరపై ఇలాంటి కథాంశంతో ఎవ్వరూ సినిమా తీయలేదు. కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది''అన్నారు.


గౌతమ్‌ మేనన్‌ చెబుతూ ''తెలుగులో నేను నిర్మించిన తొలి చిత్రమిది. కథ నచ్చే ప్రేమ్‌సాయికి అవకాశం ఇచ్చాను. అందరూ తమ వంతు సహకారం అందించారు''అన్నారు.


Nitin's Courier Boy Kalyan: copy of Hollywood film?

దర్శకుడు మాట్లాడుతూ ''ఓ కొరియర్‌ బోయ్‌ కథ ఇది. ఓ కొరియర్‌ వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకొన్నాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. వినోదం, యాక్షన్‌, థ్రిల్‌ కలగలిపిన ప్రేమకథ ఇది. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం ఆకట్టుకొంటుంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నాము''అన్నారు.


గౌతమ్ మీనన్ మాట్లాడుతూ....''ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా కారణాలున్నాయి. తెలుగులో షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. తమిళంలో జీవా కాల్షీట్లు కావల్సినన్ని దొరకలేదు. రెండు భాషల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనుకొన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు'' అని చెప్పుకొచ్చారు.


అశుతోష్‌ రాణా, నాజర్‌, సత్యం రాజేష్‌, సప్తగిరి, రవి ప్రకాష్‌, యింటూరి వాసు తదితరులు నటించారు.

English summary
Nitin's Courier Boy Kalyan is also looking like having an Hollywood inspiration. Looking at the trailer of Nitin's film and 2012 Hollywood thriller "Premium Rush". Director Premasai of Courier Boy Kalyan however condemned these reports.
Please Wait while comments are loading...