»   »  హిట్ హీరో కదా అని వెళ్తే వేపుకు తింటున్నాడు

హిట్ హీరో కదా అని వెళ్తే వేపుకు తింటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇష్క్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నితిన్ వరసగా సినిమాలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు పన్నెండు చిత్రాల తర్వాత వచ్చిన హిట్ ని ఎలాగైనా నిలుపుకోవాలనే తాపత్రయంలో దర్శకులను వేపుకు తినేస్తున్నాడని సమాచారం. కథలో మార్పులంటూ దర్శకుల సహనాన్ని పరీక్షిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అందులోనూ హార్ట్ ఎటాక్ చిత్రం అనుకున్న రేంజిలో హిట్ కాకపోవటం కూడా అతన్ని భయంలోకి తీసందంటున్నారు. అతి జాగ్రత్తతో ఏ కథా నచ్చటం లేదని, సీన్స్, స్క్రిప్టు అంటూ రోజులు తరబడి డిస్కషన్స్ చేస్తున్నాడని, కమర్షియల్ సినిమా అంటూనే కొత్తదనం పేరుతో ఇబ్బంది పెడుతున్నాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

ఇది నిజమా అన్నట్లు రీసెంట్ గా ఓ చిత్రం ఓపెన్ అయ్యి మరీ ఆగిపోయింది. తన సొంత సంస్ధ లో ఈ చిత్రం నిర్మాణం ప్రారంభించారు. ఈ చిత్రానికి సురేంద్రరెడ్డి శిష్యుడైన శ్రీనివాస్ దర్శకుడు గా మొదలెట్టారు. కానీ క్రియేటివ్ డిఫెరెన్సిస్ వల్ల చిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే కథలో తను, తన రచయిత ఎక్కువగా ఇన్వాల్వ్ కావటంతో మొత్తం ప్రాజెక్టుపై ఇంపాక్ట్ పడుతోందని ఆ దర్శకుడే చేతులు ఎత్తేసాడని చెప్పుకుంటున్నారు.

Nitin's torture to tollywood directors

అలాగే రీసెంట్ గా కొత్త జంటతో వచ్చిన మారుతి సైతం చాలా స్టోరీ లైన్స్ వినిపించాడని, అవి కూడా ఏదీ నచ్చలేదని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క కరుణాకరన్ స్క్రిప్టు అయితే ఇప్పటికే రెండేళ్ళకు పైగా నలుగుతోందని, నితిన్ చాలా మార్పులు సూచించాడని, ఓ దశలో ప్రాజెక్టు ఆగిపోతుందనుకున్నారని అంటున్నారు. అయితే కరుణాకరన్ కి సైతం బయిట మార్కెట్ లేకపోవటంతో అలా ఓపిగ్గా ఈ ప్రాజెక్టుని ఎలాగైనా పట్టాలు ఎక్కించాలనే పట్టుదలతో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

మరో ప్రక్క నితిన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ఫోటాన్‌ కథాస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పెై తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌' చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రేమ్‌సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం 'తమిళ సెల్వనుం తనియార అంజలుం' పేరుతో ఈ చిత్రం రూపొందబోతోంది. నిర్మాత గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో లవ్‌, యాక్షన్‌, కామెడీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. సింగర్‌ కార్తీక్‌ ఈ చిత్రానికి మంచి సంగీతం అందిస్తున్నాడు.

English summary
In view of regaining the glory Nitin is so cautious in the stories. So, whom ever approached him are suffered with his deep involvement in the direction wing, Production and also in other activities. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu