»   »  నిత్యామీనన్ ని కూడా లాక్కెళ్లిపోతోంది

నిత్యామీనన్ ని కూడా లాక్కెళ్లిపోతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సౌత్ లో బిజీగా ఉండేవాళ్లు తమ కెరీర్ అవకాశాలు పెంచుకోవటం కోసం బాలీవుడ్ వైపు చూడటం మామూలే. అయితే ఇక్కడ ఆఫర్స్ లేనివారు కూడా అటు వైపే ప్రయాణం పెట్టుకుంటన్నారు. తాజాగా అలా మొదలైంది దర్శకురాలు నందీనీ రెడ్డి అటు వైపే ప్రయాణం పెట్టుకుంది. ఆమె తీసిన తొలి చిత్రం అలా మొదలైంది ని హిందీలో రీమేక్ చేయటానికి సన్నాహాలు చేసుకుంటన్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం హిట్ లో మేజర్ షేర్ అయిన నిత్యామీనన్ నే తీసుకుని ఆమె ప్రయాణం పెట్టుకుంది అంటున్నారు. నిత్యామీనన్ తో అయితే ఖచ్చితంగా హిట్ గ్యారెంటీ అని,మంచి స్టాటజీ అంటున్నారు.

అక్కడ ఓ పెద్ద నిర్మాణ సంస్ధతో కలిసి దామోదర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒరిజనల్ లో నటించిన నిత్యా మీనన్ కూడా ఈ చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. హీరోగా ఓ కొత్త కుర్రాడు నటించే అవాశమున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు హిట్ అయితే హిందీలో వరస సినిమాలు చేయాలనే ఆలోచనలో నందినీ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీకి తగినట్లు చిన్న చిన్న మార్పులతో ఈ స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు.

Nitya Menon and Nandini Reddy going for Bollywood

నిత్యామీనన్ విషయానికి వస్తే... 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రంతో తన నటన, గ్లామర్‌తో యూత్ మతిపోగొట్టిన నిత్యా మీనన్...త్వరలో 'మాలిని 22' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదో రివేంజ్ డ్రామా. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌తో పోస్టర్లో నిత్యా మీనన్ కత్తి పట్టుకుని దర్శనం ఇస్తోంది. ఈ చిత్రాన్నికి నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో పాటు తమిళంలోనూ ఈచిత్రాన్ని విడదుల చేస్తున్నారు. తమిళంలో ఈచిత్రాన్ని '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేసారు. ఆ సినిమా వర్కవుట్ కాలేదు.

ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అని తెలుస్తోంది. 2012లో మళయాలంలో వచ్చిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో....ఈ చిత్రం ఒక సందేశాత్మకంగా, మేలుకొలుపుగా ఉంటుందని అంటున్నారు.

ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు నిత్యా మీనన్ తెలుగులో 'ఏమిటో ఈ మాయ' అనే చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి చేరన్ దర్శకకత్వం వహిస్తున్నారు. ఇదే చిత్రం తమిళంలోనూ విడుదలకానుంది.

English summary
Nandini Reddy who spellbound all with Ala Modalaindi in Tollywood is getting ready to strike in Bollywood. Pre production works will start once the deal is struck. Nityamenon will be acting in this project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X