»   » మెగా క్యాంప్ లోకి నిత్యామీనన్ ఎంట్రీ

మెగా క్యాంప్ లోకి నిత్యామీనన్ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nitya Menon ok to act with Allu Sirish
హైదరాబాద్ : మెగా హీరోలలో ఒకరి సరసన చేస్తే మిగతా వాళ్లందరూ ఆమెను తమ సినిమాల్లో తీసుకుంటారనే విషయం తెలిసిందే. దాంతో హీరోయిన్స్ ఎలాగైనా ఈ క్యాంప్ లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా నిత్యామీనన్ ఈ క్యాప్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్న మెగా హీరో అల్లు శిరీష్ సరసన ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రేమ ఇష్క్ కాదల్ దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె చేయటానికి అంగీకరించిందని సమాచారం. జూలై నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది.

నిత్యామీనన్ విషయానికి వస్తే... 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రంతో తన నటన, గ్లామర్‌తో యూత్ మతిపోగొట్టిన నిత్యా మీనన్...త్వరలో 'మాలిని 22' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదో రివేంజ్ డ్రామా. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌తో పోస్టర్లో నిత్యా మీనన్ కత్తి పట్టుకుని దర్శనం ఇస్తోంది. ఈ చిత్రాన్నికి నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో పాటు తమిళంలోనూ ఈచిత్రాన్ని విడదుల చేస్తున్నారు. తమిళంలో ఈచిత్రాన్ని '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేసారు. ఆ సినిమా వర్కవుట్ కాలేదు.


ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అని తెలుస్తోంది. 2012లో మళయాలంలో వచ్చిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో....ఈ చిత్రం ఒక సందేశాత్మకంగా, మేలుకొలుపుగా ఉంటుందని అంటున్నారు.

ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు నిత్యా మీనన్ తెలుగులో 'ఏమిటో ఈ మాయ' అనే చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి చేరన్ దర్శకకత్వం వహిస్తున్నారు. ఇదే చిత్రం తమిళంలోనూ విడుదలకానుంది.

English summary
Nitya had come down by okaying to do with Allu Sirish. Pawan Sadineni who has recently directed Prema Ishq Kadal will direct the new venture and chubby Nitya will be the female lead in the movie! The movie will start in July!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu