twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రాజన్న' ఆడియో పంక్షన్ ఎందుకు చెయ్యలేదు?

    By Srikanya
    |

    నాగార్జున తాజా చిత్రం రాజన్న ఆడియో పంక్షన్ జరపకుండా డైరక్ట్ రిలీజ్ చేయటం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రెగ్యులర్ నాగార్జున సినిమాకు మంచి హంగామాగా ఆడియో పంక్షన్ జరిపి సినిమాకు క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సారి రాజన్నకు చేయకపోవటానకి కారణాలు రెండు చెప్తున్నారు. మొదటిది ఈ చిత్ర దర్శకుడు విజియేంద్ర ప్రసాద్ పెట్టిన బ్యాన్. ఈ నేపధ్యంలో ఆయన మీడియా ముందుకు, ఫంక్షన్ కి హాజరు అవ్వటం ప్లస్ కన్నా మైనస్ అయ్యే అవకాశముంది. అలాగే రెండవ కారణం ఈ చిత్రం కథ ఓ పాప చుట్టూ తిరుగుతుంది. సెకండాఫ్ లో ఇరవై నిముషాలు సేపు మాత్రమే నాగార్జున కనపడతాడు. అలాంటప్పుడు ఆడియో పంక్షన్ చేసి హంగామా చేస్తే లేనిపోని హంగామా చేసినట్లు అయ్యి, హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారుట.

    ఇప్పటికే నాగార్జుతో వేసిన పోస్టర్ అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుని బిజినెస్ జరుగుతోంది.అంతా నాగార్జున సినిమాలో పూర్తిగా కనపడతారనే భావనలో ఉన్నారు. నాగార్జున కనపించే ఎపిసోడ్స్ మొత్తం విజయేంద్రప్రసాద్ కుమారుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరక్ట్ చేయనున్నారు. తెలంగాణ నేఫద్యంలో పీరియాడిక్ గా ఈ ఎపిసోడ్ ఉంటుందని యాక్షన్ ప్రధానంగా రూపొందుతుందని సమాచారం. రజాకార్ల ఉద్యమం నేపద్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధుడి కధతో 'రాజన్న' తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.ఈ చిత్రం కథ జరిగే కాలం..1945-55. ఇక ఈ చిత్రంలో నాగార్జున పూర్తి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూంటారు.

    English summary
    Nagarjuna’s upcoming release Rajanna will not have any audio launch ceremony. The audio of the film will be directly released in to market on November 26.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X