»   » బ్రహ్మానందం కొడుకు సినిమాకు బయ్యర్లు కరువు

బ్రహ్మానందం కొడుకు సినిమాకు బయ్యర్లు కరువు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా చేసిన మొదటి సినిమా పల్లకీలో పెళ్ళికూతురు భాక్సాఫీస్ వద్ద ఫెయిలయిన సంగతి తెలిసిందే. ఆ ఇంపాక్ట్ ల్యాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన వారెవా చిత్రంపైన కూడా పడుతోంది. ఈ చిత్రం మార్కెట్ కావటంలేదని, కొనటానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్ర నిర్మాత దీన్ని ఎలా అమ్ముకోవాలిరా అని టెన్షన్ తో ఉంటే బ్రహ్మానందం మాత్రం కూల్ గా తన కొడుక్కి ఈ చిత్రం నిమిత్తం రావల్సిన మిగతా పేమెంట్ కోసం రోజూ వెంటాడుతున్నాడని చెప్తున్నారు.సినిమా ప్రారంభైన నాటినుండీ ఏ దశలోనూ క్రేజ్ సంపాదించుకోలేక పోయిన ఈ చిత్రాన్ని బయిట పడేసే భాద్యత బ్రహ్మానందం తీసుకుంటేనే బెస్ట్ అంటున్నారు. ఈ చిత్రం ద్వారా శాంభవి హీరోయిన్ గా, కళ్యాణ్‌ మంతెన దర్శకునిగా పరిచయమవుతున్నారు. మూవీ మిరాకిల్స్‌ పతాకంపై మహేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. "కాలేజి నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్ ‌టైనర్‌ ఇది. గౌతమ్‌ పాత్ర సరదాగా సాగిపోతూ అందర్నీ ఆకట్టుకుంటుంది' అని చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X