»   »  తమన్నా తహతహ

తమన్నా తహతహ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tamanna
కంఫర్ట్ గా కెరీర్ ని ఫీలయినప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, కోరికలు,డిమాండ్లు పుట్టుకు రావటం ఎవరికైనా అత్యంత సహజం. తాజాగా బి.గోపాల్, యమ్.యస్.రాజు ల తొలి కాంబినేషన్ లో వస్తున్న 'జోష్' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన తమన్నాకి కెరీర్ మెల్లిమెల్లిగా బలపడుతూండటంతో ఆమెకు ధైర్యమొచ్చి కొత్త ఆలోచనలుకు శ్రీకారం చుడుతోంది. హీరోయిన్‌గా ఆమె తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించినా ఎక్కడా ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పలేదు. ఎవరూ ఎంకరేజ్ చెయ్యలేదు. అయితే ఇన్నాళ్ళకు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాలనే కోరిక, ఆలోచన ఆమెకు కలిగి నిర్మాతలకు ఆ కండీషన్ వినిపిస్తోందిట.

నిజానికి 'శ్రీ' చిత్రం ద్వారా ఈ బ్యూటీ తెలుగుతెరకు పరిచమైనా ..ఆ చిత్రం హిట్ సాధించకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో తమిళంలోకి అడుగుపెట్టిన తమన్నా 'కేడీ' చిత్రంలో నెగటివ్ రోల్ పోషించింది. అయితే ఆ చిత్రం సైతం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. దాంతో కొద్దిరోజుల పాటు సినిమాలకు దూరమై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీడేస్' చిత్రంతో తొలిసారిగా విజయాన్ని చవిచూసింది. అలాగే తమిళంలో తమన్నా నటించిన 'కల్లూరి' (కాలేజ్) అనే చిత్రం విజయం సాధించింది. దీంతో తమన్నా కెరీర్ మళ్ళీ ఊపందుకుంది. తాజగా సుశాంత్ హీరోగా పరిచయమైన 'కాళిదాసు' చిత్రంలో చాలా గ్లామరస్‌ గా కనిపించిన తమన్నా ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా మారిపోయింది.

దాంతో తన టైమ్ వచ్చిందని అర్థం చేసుకున్న ఆమె డబ్బింగ్ చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ వీలైనంత త్వరగా తెలుగులో తాను డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమవుతున్నానని చెప్పింది. తెలుగుతో పాటు తమిళంలోనూ తానే డబ్బింగ్ చెప్పాలని కూడా తాను అనుకుంటున్నట్టుగా తెలిపింది. ఇప్పుడు ఆమె తమ సినిమాలో కనిపడితే చాలు అనుకుంటూ దర్శక నిర్మాతలు వస్తుంటే డబ్బింగ్ ఏం కర్మ దర్శకత్వం కూడా చేసేయచ్చు ...ఎన్ని డిమాండ్స్ అయినా ముందు పెట్టచ్చు. ఏది ఏమైనా త్వరలోనే ఆమె నటనతో పాటు ఆమె గొంతును కూడా మనం వినబోతున్నామన్నమాట. నిర్మాతల మాటేమో గాని ఆమె సొంతు గొంతు ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఆమె అభిమానులకు సంతోషమే కదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X