»   » వర్మ స్పెషల్, ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ గెరిల్లా షూటింగ్

వర్మ స్పెషల్, ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ గెరిల్లా షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివాదాస్పద కథలను తెరకెక్కించే రాంగోపాల్ వర్మ...మహి గిల్ ప్రధాన పాత్రలో 'నాట్ ఎ లవ్ స్టోరీ" సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఆపిల్ 'ఐ ఫోన్4" ద్వారా చిత్రీకరించారని చిత్ర యూనిట్ సభ్యలు మీడియాకు వెల్లడించారు.

కథలో భాగంగా....హీరోయిన్ మహిగిల్ ఓ షాపింగ్ మాల్ కెళ్లి పెద్ద పాలిథిన్ కవర్లు, వంటగదిలో వాడే పెద్ద కత్తులను కొనాల్సిన సీన్ చిత్రించాల్సి వచ్చింది. అయితే మాల్‌లోకి డిజిటల్ కెమెరాకు అనుమతి ఇవ్వక పోవడంతో...సినిమాటోగ్రాఫర్ జర్యాన్ పటేల్ ఆ సన్ని వేశాలను ఐఫోన్ ద్వారా చిత్రీకరించారట. ఐఫోన్ తో తీసిన సన్ని వేశాలు 15 నిమిసాల పాటు ఉన్నాయట ఇందులో. ఐఫోన్‌తో చిత్రీకరించినప్పటికీ నీట్‌గా వచ్చాయని, సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని హీరోయిన్ మహి గిల్ స్పష్టం చేసింది.

టివి ఎక్సిక్యూటివ్ నీరజ్ గ్రోవర్..హత్య కేసు ఆధారంగా రామూజీ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. నీరజ్ గ్రోవర్ హత్య కేసులో నిందితురాలుగా ఉన్న మరియా సుసైరాజ్ పాత్రలో మహిగిల్ నటించింది.

English summary
There is a scene in Not A Love Story wherein Mahie Gill is seen in a mall buying polythene bags and big kitchen knife, so that they can chop off the dead body. The digital camera were not allowed in the Mall premises, on the suggestion of the Cinematographer Zaryan Patel, the cameraman shot the sequence with an iPhone4.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu