»   » మొన్న ఎన్టీఆర్ ని ఇప్పుడు అల్లు అర్జున్ తోనూ

మొన్న ఎన్టీఆర్ ని ఇప్పుడు అల్లు అర్జున్ తోనూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దర్శకుడు సుకుమార్ తనకు అందుబాటులో ఉన్న హీరోలతో తను నిర్మాతగా చేస్తున్న చిత్రం ప్రమోషన్స్ చేయిస్తున్నారు. మొన్న ఎన్టీఆర్ ని పిలిచి కుమారి 21 ఎఫ్ చిత్రం టీజర్ ని విడుదల చేసిన సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ముందుకు వెళ్ళనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఆడియోని అల్లు అర్జున్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. అలా ప్రాజెక్ట్ కు పూర్తి స్ధాయిలో క్రేజ్ తేవాలని సుకుమార్ ఫిక్స్ అయ్యి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. ఇక మహేష్ ని మరి దేనికి పిలుస్తారో చూడాలి.

చిత్రం విశేషాలకు వెళ్తే..

కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుమారి 21 ఎఫ్.

Now Allu Arjun For Sukumar's Debut

ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ నెలలో చిత్ర గీతాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ఓ యువజంట ప్రేమ పయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? వారి ప్రేమ చివరకు ఏ తీరాలకు చేరుకుంది? అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఆద్యంతం సుకుమార్ శైలిలో సాగే చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ బాణీలు వినసొంపుగా ఉంటాయి.

ఇటీవలే ఏన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది అన్నారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.

English summary
While Jr NTR has released the teaser of the "Kumari 21 F" film, we hear that Allu Arjun will launch the music. It will happen either on 30th or 31st, depending upon Sukumar's return from Spain as the new schedule of Naannaku Prematho will be on floors by that time.
Please Wait while comments are loading...